V1News Telangana

best news portal development company in india

తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ముధోల్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం…

SHARE:

తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ముధోల్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం…

ముధోల్,డిసెంబర్ 12(వి1 న్యూస్ తెలుగు):ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై పవార్ రామారావు పటేల్ ను మంగళవారం తెలంగాణ ఉద్యమకారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు,

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయములో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కొరకు ఆత్మ బలిదానము చేసుకున్న ముధోల్ నియోజకవర్గం యొక్క అమరుల కుటుంబాలకు న్యాయము చేయాలని, ఉద్యమకారులకు అన్ని ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు,ప్రతేక తెలంగాణ ఆవిర్భావించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరువాత కూడా ముధోల్ నియోజకవర్గం ఉద్యమ అమరవీరుల కుటుంబాలు ఎన్ని విజ్ఞప్తులు చేసిన కూడా గత ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం, ఉద్యోగం అందించలేదని,
తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన వారి యొక్క యఫ్.ఐ.ఆర్, పీ.ఎం.రిపోర్ట్,పేపర్ స్టేట్మెంట్స్ అన్ని భైంసా తహశీల్దార్ ద్వారా ప్రభుత్యానికి అందించి ఎన్ని సార్లు తిరిగినను ప్రకటించిన సహాయం లభించలేదని,ఈ విషయంలో కూడా ప్రతేక శ్రద్ద తీసుకొని వారికి ఆదుకోవాలని కోరారు వినతిపత్రాన్ని అందజేశారు,ఈ కార్యక్రమములో
తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు
డాక్టర్.ముష్కమ్ రామకృష్ణ గౌడ్,ముధోల్ నియోజకవర్గం ఉద్యమకారులు చాకేటి లస్మన్న,తెలంగాణ తెలుగు కళా నిలయం పుండలిక్ రావు జాదవ్,భైంసా కౌన్సిలర్ గౌతమ్ పింగ్లే,భీంరావ్ డోన్గ్రే,బాసర నాయకులు మనోహర్, విద్యార్ధి ఉద్యమ నాయకులు సాయి, సందీప్,ముధోల్ రాంరెడ్డి,రాజలింగు,రఘువీర్, లోకేశ్వరం కరుణసాగర్, అమరవీరుల కుటుంబ సభ్యులు లత భాస్కర్, రాధమ్మ,మున్నూరు కాపు మిత్ర మండలి పెండపు కాశినాథ్,కోర్వగల్లి నాయకులు నర్సయ్య,తదితరులు, పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india