V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వం యొక్క ఆదేశాలు మాకేం లేవు 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ కోసం మేము ఆధార్ కార్డులు జనాలనుంచి సేకరిస్తలేము ఆరు నెలల క్రితం మా కంపెనీ ఆధార్ కార్డులు ఇతర పత్రాలు స్వీకరించమంటే సేకరిస్తున్నాం స్వీకరణ కంపెనీ ఆదేశాల మేరకే చేస్తున్నం కానీ దేనికోసమో మాకు తెలియదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో మాకు రాలేదు 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం అయితే కాదు, ఆధార్ కార్డు ఇతర పత్రాల సేకరణ విషయం మాకు తెలియదు కంపెనీ ఆదేశాల మేరకే సేకరిస్తున్నాం గ్యాస్ డీలర్లు

SHARE:

నిజామాబాద్ జిల్లా
కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు కావడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ అని చెప్పడంతో, సబ్సిడీ గ్యాస్ తో పాటు మరో ఐదు స్కీములను వారు ఇంప్లిమెంట్ చేశారు, 500 సబ్సిడీ గ్యాస్ యొక్క ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదని తెలంగాణ రాష్ట్రం తో పాటు, ఉమ్మడి నిజాంబాద్ జిల్లాతో పాటు బోధన్ నియోజకవర్గంలో పాటు ఉమ్మడి మండలాల్లో సైతం సబ్సిడీ గ్యాస్ కోసమే అని జనాలు గ్యాస్ షాప్ ఎదుట జనం బారులు తీరుతున్నారు.

జనమంతా 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ కోసమే ఆధార్ కార్డు తో పాటు ఇతర పత్రాలు సమర్పించాలంటూ జనం ఎగబడుతూ క్యూ కడుతున్నారు. కానీ గ్యాస్ డీలర్లు మాత్రం దేనికోసమో మాకు తెలియదని కంపెనీ గత ఆరు నెలల కిందట సేకరించమని చెబితే తాము స్వీకరిస్తున్నామే తప్ప ప్రభుత్వం నుంచి 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ కోసం సేకరించమని ఎలాంటి ఆదేశాలు మాకు రాలేదని చెప్పడం విశేషం, పాపం జనం మాత్రం ఈ విషయం తెలియక 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ కోసమే ఈ ఆధార్ కార్డు తో పాటు ఇతర పత్రాలు సమర్పిస్తున్నామని, ప్రభుత్వం నుంచి సబ్సిడీ గ్యాస్ కోసం ఆదేశాలు వచ్చాయని దీని కోసమే తాము ఇస్తున్నామని ఏమీ తెలియక జనం మాత్రం గ్యాస్ డీలర్ షాపు ఎంత ఆధార్ కార్డుతో పాటు ఇతర పత్రాలు సమర్పించడం కోసం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. జనం భారీ సంఖ్యలో డీలర్ షాపు ఎదుట క్యూ కట్టడంతో పోలీసు సైతం బందోబస్తు నిర్వహిస్తున్నారు అదేవిధంగా రోడ్లపై జామ్ కావడంతో వాహనాలు ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. బోధన్ హెచ్.పీ గ్యాస్ డీలర్ ఆదినారాయణ షాపు ఎదుట జనం క్యూ కడుతున్నారు పోలీసులు మాత్రం బందోబస్తు నిర్వహిస్తున్నారు, ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ సబ్సిడీ గ్యాస్ ₹500 కోసం సేకరించమని ఎలాంటి ఆదేశాలు రాలేదని తమ కంపెనీ 6 నెలల క్రితమే ఆధార్ కార్డుతో పాటు ఇతర పత్రాలు కేవైసీ కోసం స్వీకరించమని చెప్తే తాము సేకరిస్తున్నామని. 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ కోసం కాదని, దేనికోసమో మాకు తెలియదని కంపెనీ ఆదేశాల మేరకే సేకరిస్తున్నామని సమాధానం ఇచ్చారు. ఈ విషయం జనంకు తెలియక గ్యాస్ డీలర్ షాప్ ల ఎదుట బారులు తిడుతున్నారు అయితే ఇది 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ కోసం మాత్రం కాదని డీలర్లు స్పష్టంగా చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు కానీ కంపెనీ యొక్క ఆదేశాలు ఆరునెల క్రితం పత్రాలు సేకరించమంటే సేకరిస్తున్నామని డీలర్లు సమాధానం ఇస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india