V1News Telangana

best news portal development company in india

సి పి ఐ (మావోయిస్టు) దళ సభ్యుని అరెస్ట్

SHARE:

సి పి ఐ (మావోయిస్టు) దళ సభ్యుని అరెస్ట్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం డిసెంబర్:- రామగుండం కోల్ బెల్ట్ ఏరియా

సి పి ఐ (మావోయిస్ట్) పార్టీ కోల్ బెల్ట్ ఏరియా లో తన ప్రభవాన్ని పునరుద్ధరించు కోవడానికి చేసే ప్రయత్నాలలో బాగంగా సి కా స కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేసి వారి ప్రయత్నాలను రామగుండం కమిషనరేట్ పోలిసులు ఆదిలోనే తిప్పి కొట్టడం జరిగింది.రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ మీడియా తో మాట్లాడుతూ  7 డిసెంబర్ 2023 రోజు సమయం రాత్రి 1-00 గంటలకు గోదావరిఖని పట్టణంలోని ఆర్ జీ – 1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం జంక్షన్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతిలో సంచి తో సీఎస్పీ కాలనీ వైపు వెళ్తూ పోలిసులకు కనిపించినాడు. అతను అనుమానాస్పదంగా కనిపించడంతో పోలిసులు అతడిని సమీపించగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసినాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా అతడు సి పి ఐ మావోయిస్ట్ పార్టీ సభ్యుడిగా సికాస కార్య కలాపాలను విస్తరించడానికి పార్టీ ఆదేశాలతో గోదావరీఖని కి వచ్చినట్టు తెలిపినాడు. నిందితుడు అవినాష్, బి. ఎస్. సి.(నర్సింగ్) పూర్తి చేసి తన గ్రామంలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ వుండే వాడు. ఆ క్రమంలో అక్కడ ఉన్న ప్రజా సంఘాల వారు కర పత్రాల ముద్రణ కోసం వచ్చి పోయే వారు. వారి పరిచయం ద్వారా సి.పి. ఐ . (మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఏర్పడి వారి భావజాలం పట్ల ఆకర్షితుడైనాడు. సుమారు రెండు సంవత్సరముల క్రితం సి.పి. ఐ . (మావోయిస్టు) పార్టీలో చేరి పని చేస్తున్నాడు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సింగరేణి కార్మిక సమాఖ్య విభాగం ఆదేశాల మేరకు తాను ఇక్కడ గోదావరిఖనిలో సికాస కార్యకలాపాలను విస్తరించే పనిలో భాగంగా గోదావరిఖని వచ్చినాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి గోదావిఖనిలో వాల్ పోస్టర్లు అతికించి వెళ్లడానికి రాగా పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని గమనించి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అని సీపీ తెలిపారు.స్వాదీనం చేసుకున్న వస్తువుల వివరాలు ఆతని వద్ద నుండి కొన్ని వాల్ పోస్టర్లు స్వాధీనం చేసుకోవడమైనది నిందితుడి వివరాలు పామిడిమల్ల అవినాష్, @ మల్లేష్ s/o. వరప్రసాద్, 29 సం.లు. అర్ /ఓ. సాతులూరు గ్రా., నాదెళ్ల మండలం, పల్నాడు జిల్లా ఆంద్రప్రదేశ్.

 

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india