బోధన్, పెగడపల్లి విలేకరులకు ఇచ్చిన ప్లాట్లు, డబుల్ బెడ్ రూమ్‌లలో లొల్లి
గతంలో లబ్ధి పొందిన విలేకరులు, స్థానికులు కాని వారికి ప్లాట్లు డబుల్ బెడ్ రూమ్ ఎట్లా ఇస్తారని ఆరోపణలు
స్థానికంగా లేనివారు అర్హులు కాని వారు ఆధార్ కార్డు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఎట్ల ఇస్తారని ఆరోపణలు
ఎంపీటీసీ కూడా నాకు కావాలంటూ మిగతా విలేకరు కూడా మాకు ఎట్లా ఇవ్వరు అంటూ
మేము సైతం ప్లాట్లు వేసుకుంటామని బయలుదేరుతున్నట్టు సమాచారం
22 మందికే డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చామని మిగతా వారికి బిల్లులు ఇవ్వలేమని ప్లాట్లతో మాకు సంబంధం లేదని హౌసింగ్ శాఖ అధికారి తెలిపారు.
ఇండ్లు కట్టిన వారికే బిల్లులు ఇచ్చాం మిగతా వారికి ఇవ్వలే
బిపిఎల్ కోటలో స్థానికంగా ఉన్నవారికి ఇచ్చారా
దీని మీద ఎలక్షన్లు ఉన్నాయి ఇవి కాగానే తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం ఎమ్మార్వో గంగాధర్..
బోధన్
బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారు ప్రాంతంలో సుమారు 80 మంది విలేకరులకు డబుల్ బెడ్ రూమ్ పంపిణీ చేశారు అనేది ప్రధాన ఆరోపణ, ఈ 80 మందిలో విలేకరులు స్థానికులు కాని వారు ఉన్నారని ఇక్కడ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేని వారు ఉన్నారని బిపిఎల్ కోటలో స్థానికంగా ఆధార్ కార్డు లేని వారికి ఏ విధంగా ఇచ్చారని పలువురు మంది పడుతున్నారు. గతంలో లబ్ధి పొందిన విలేకరులకే మళ్లీ మళ్లీ ఏ విధంగా ప్లాట్లు డబల్ బెడ్ రూమ్ లు ఇస్తారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. కానీ విలేకరులకు కూడా స్థానికంగా లేని వారు విలేకరులు కూడా అక్కడ డబుల్ బెడ్ రూమ్ లు కానీ ప్లాట్లు కాని ఏ విధంగా ఇస్తారని పలువురు విమర్శలు చేస్తూ ప్రశ్న చేస్తున్నారు.
ఈ సందర్భంగా హౌసింగ్ శాఖ ఏఈ నాగేశ్వరరావును వివరణ కోరగా కేవలం 22 మందికే హౌసింగ్ బిల్లులు ఒక్కొక్క బిల్లు ఇచ్చామని మిగతా వారికి ఇవ్వలేదని దీనిపై సమగ్ర సమాచారం తహసిల్దార్ గంగాధర్‌ను అడిగి తెలుసుకోవాలని వివరణ ఇచ్చారు. ఎమ్మార్వో బోధన్ కు చరవాణి ద్వారా ఫోన్లో వివరణ కోరగా ఎవరైతే ఇల్లు కట్టారో వారికే డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చామని మిగతా వారికి ఇవ్వలేదని చెప్పారు. బిపిఎల్ కోటలో అర్హులు కాని వారికి అదేవిధంగా స్థానికంగా లేనివారికి ఇచ్చారని ఆరోపణ ఉందని ప్రశ్నాడగా ఎలక్షన్లు ఉన్నాయని ఇవి కాగానే ఎంక్వయిరీ చేస్తామని ఎమ్మార్వో గంగాధర్ సమాధానం చరవన్లో ఇచ్చారు. అదే ప్లాట్ల లో ఒక గ్రామానికి చెందిన ఒక ఎంపీటీసీ కూడా నాకు కావాలంటూ ప్లాట్లు, అదేవిధంగా మరికొంత విలేఖలు కూడా మాకు అన్యాయం జరిగిందని మాకు ప్లాట్లు ఇవ్వాలంటూ వారు కూడా ప్లాట్లు వేస్తామని జగడాకు, రగడకు దిగుతున్నట్టు సమాచారం. కొంతమంది విలేకరులు వారికి సంబంధించిన కుటుంబీకులకు వారికి సంబంధించిన దోస్తులు విలేకరులు కాకుండా అర్హులు కాకుండా ప్లాట్లు ఇచ్చి మిగతా విలేకరులు అర్హులై ఉన్నప్పటికీ వారిపై వివక్ష చూపారు అనేది ప్రధాన ఆరోపణ. సుమారు 70 నుంచి 80 మంది విలేకరులకు ప్లాట్లు ఇచ్చినప్పుడు వారు అర్హుల అనర్హుల అనేది అధికారులు పాలకులు ఎంక్వయిరీ చేశారా చేయకుండా ఎలా ఇచ్చారు అనేది ప్రధాన విమర్శ,. పట్టణంలో ఎంతో మంది నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్‌లు, ప్లాట్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి ఇవ్వకుండా అన్హర్వులుగా ఉన్నవారికి ఏ విధంగా ఇస్తారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








