V1News Telangana

best news portal development company in india

ముధోల్ గురుకుల ప్రిన్సిపాల్ ను మార్చాలంటు* – టిఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ ఉపాధ్యాయుల ధర్నా

SHARE:

*ముధోల్ గురుకుల ప్రిన్సిపాల్ ను మార్చాలంటు*

– టిఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ ఉపాధ్యాయుల ధర్నా

ముధోల్,డిసెంబర్ 05(వి1 న్యూస్ తెలుగు): ఉపాధ్యాయులే లక్షంగా ఒత్తిడికి గురి చేస్తున్న ముధోల్ టిఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ పాఠశాల,కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.రఫీద్దీన్ ను మార్చాలని స్థానిక ఉపాధ్యాయులు వారికీ లభించిన ఖాళీ సమయంలో మంగళవారం కళాశాల ముందు రోడ్డుపై ధర్నాకు దిగారు,

ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మానసికంగా వేదిస్తున్నారని తెలిపారు,గతంలో విధులు నిర్వహించిన స్థానంలో సైతం ఆయనపై వేటు పడిందని ప్రిన్సిపాల్ తీరును ఎండగట్టారు, ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు,ఇదే విషయమై మీడియా ప్రిన్సిపాల్ ను ప్రశ్నించగా వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని దాటవేశారు,విద్యార్థుల భవిషత్తు,పాఠశాల అభివృద్ధికి అందరూ కృషి చేయాలనీ ఉపాధ్యాయులకు ఆదేశించగా వారు తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india