ప్రజా తీర్పును గౌరవిస్తాం…!
– బీఎస్పీ నిర్మల్ నియోజకవర్గం అభ్యర్థి జగన్ మోహన్.
నిర్మల్,డిసెంబర్ 04(వి1 న్యూస్ తెలుగు): నిర్మల్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఎస్పీ నిర్మల్ నియోజకవర్గం అభ్యర్థి జగన్ మోహన్ మాట్లాడుతూ….
నిర్మల్ నియోజకవర్గం ప్రజల తీర్పును గౌరవిస్తాము అని, బహుజన సమాజ్ పార్టీకి నమ్మకంతో ఓటు వేసి ప్రజాస్వామ్య విలువల్ని మరింత పెంచిన ఓటరు మహశయులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు,ఉద్యోగులకు దన్యవాదాలు,
తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి,ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి కి ,నిర్మల్ నియోజకవర్గం శాసనసభ్యులుగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి కి అభినందనలు,ఎన్నికల్లో మాతో కలిసి పనిచేసిన నాయకులకు, బహుజన వాదులకు, పూలే, అంబేద్కర్, కాన్షీరాం ఆలోచన వాదులకు కృతజ్ఞతలు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం,గెలుపుకు దూరం అయినను ప్రజల మనస్సుకు దగ్గర అయినామని భావిస్తున్నాము,భవిష్యత్తులో మరింత నూతన ఉత్సాహంతో నిర్మల్ నియోజకవర్గం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాము అని,గెలిచిన,ఓడినను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా..ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ఎల్లప్పుడు పేద ప్రజల పక్షనా కోసం పోరాటం చేస్తామని అన్నారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








