V1News Telangana

best news portal development company in india

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కు ఏర్పాటు పూర్తి: జిల్లా కలెక్టర్

SHARE:

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కు ఏర్పాటు పూర్తి: జిల్లా కలెక్టర్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది పెద్దపల్లి జిల్లా:డిసెంబర్ 2

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శనివారం మధ్యాహ్నం రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత కౌంటింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.కౌంటింగ్ పరిశీలకులు రామగుండం రాజేష్ సింగ్ రానా, మంథని సి.పి.పటేల్, పెద్దపల్లి సీ.ఎన్ శ్రీధర్ లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ…రేపు ఉదయం 8 గంటలకు జేఎన్టీయు కళాశాల బ్లాక్ 2 నందు జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభ మవుతుందనిఅన్నారు.ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో 14 కౌంటింగ్ టేబుల్, ఒక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ,మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు.పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ సమయంలో ఫారం 13ఏ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం చివరి రౌండ్ లెక్కింపు ప్రారంభానికి ముందు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు…

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india