రామగుండంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాయం చేసిన తీన్మార్ మల్లన్న

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 27:-గోదావరిఖని-: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రామగుండం ఎరువుల కర్మాగారం బాధితుల న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు మద్దతుగా సినీ నటులు శివారెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ కోల్పోతుందని, రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మల్లన్న అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని సీఎం కేసీఆర్ అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ లతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ ను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పోరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








