V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరికలు

SHARE:

రుద్రూర్ V1 న్యూస్ : బీఆర్ ఎస్ ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోకు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రుద్రూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి సమక్షంలో మైనారిటీ నాయకులు మైముద్, ఇర్ఫాన్, అల్మస్ తో పాటు ఇరవై మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పోచారం అంటే బాన్సువాడ బాన్సువాడ అంటే పోచారం అన్ని బాన్సువాడ నియోజకవర్గంలో పోచారంను ఎదురుకునే నాయకుడు లేకపోవడం వల్లనే ఎల్లారెడ్డి, నిజామాబాద్ అభ్యర్థులను తీసుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు పోచారం 75 సంవత్సరాల వయస్సులో కూడా నవయువకుడిలా పని చేస్తూ ప్రజాసేవ లక్ష్యంగా భావించి ప్రజల్లో ఉంటూన్న నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ప్రజాసేవ చేస్తున్న పోచారం కోసం పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడాలని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జండా బాన్సువాడ నియోజకవర్గం లో ఎగరావేయడం కాయమని ఇర్ఫాన్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, సొసైటీ చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారాం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india