V1News Telangana

best news portal development company in india

వంశీ పాఠశాల లో విద్యార్థిని గెంటివేసిన వైనం బోధన్ వంశీ ప్రైవేట్ పాఠశాల స్కూల్ వ్యాన్లో అత్యంత దారుణంగా విద్యార్థులకు తరలింపు

SHARE:

వంశీ పాఠశాల లో విద్యార్థిని గెంటివేసిన వైనం
బోధన్ వంశీ ప్రైవేట్ పాఠశాల స్కూల్ వ్యాన్లో
అత్యంత దారుణంగా విద్యార్థులకు తరలింపు.

బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలోని వంశీ ప్రైవేట్ పాఠశాలలో గత వారం రోజుల క్రితం ఓ విద్యార్థిని పాఠశాల నుంచి గెంటివేశారని గేటు వేశారని వారి తల్లిదండ్రులు ఆరోపించి ఎంఈఓ కు తమ సమస్యను వివరించగా, ఎంఈఓ వెంటనే సదురు పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి వారిని మళ్లీ పాఠశాలకు పంపించడం జరిగింది, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం, పెంట గ్రామానికి చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు సోషల్ వెల్ఫేర్ ద్వారా వంశీ ప్రైవేట్ పాఠశాల సీటు వచ్చిందని తెలిపారు అయితే వసతి గృహం లో ఉండగా తమ కూతురు బయటికి వెళ్లిందని అదే అదునుగా భావించి తల్లిదండ్రులైన తమల్ని పిలిపించి బయటికి గెంటి వేశారని గేటు వేశారని తెలిపారు, సోషల్ వెల్ఫేర్ నుంచి వచ్చిన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని సరిగా చూస్తా లేరు అని గెంటి వేస్తున్నారని డబ్బులు ఇస్తలేమని ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు, ఈ సందర్భంగా యాజమాన్యంతో మాట్లాడగా విద్యార్థిని ఎవరికి సంప్రదించకుండా బయటికి వెళ్లిందని ఇలా బయటికి వెళ్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు అని సోషల్ వెల్ఫేర్ ద్వారా లెటర్ తీసుకొస్తే వసతి గృహంలో కాకుండా రెగ్యులర్ గా చదువుకునే అవకాశం కల్పిస్తామని సమాధానం ఇచ్చారు,

వంశీ ప్రైవేటు వాహనంలో విద్యార్థులకు అతి దారుణంగా తరలిస్తున్న వైనం పలువురికి నివ్వర పరుస్తుంది, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి స్కూల్ ఫీజు తో పాటు వ్యాన్ ఫీజు కూడా బాగానే వసూలు చేస్తున్నప్పటికీ సౌకర్యం మాత్రం కల్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు, స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు కట్టకపోతే అనేక అంశలు విధించి విద్యార్థులకు బయట నిలబెట్టి, చిత్రవదలు చేసే స్కూల్ యాజమాన్యం వాహనంలో ఇలా విద్యార్థులకు పశువుల్లాగా తరలిస్తారా అని పలువురు మండి పడుతున్నారు వీటి పై సంబంధిత శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india