V1News Telangana

best news portal development company in india

కోరుకంటి చందర్ ను గెలిపిస్తే రామగుండం నియోజకవర్గం సమస్యలు పరిష్కారిస్తా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 

SHARE:

కోరుకంటి చందర్ ను గెలిపిస్తే రామగుండం నియోజకవర్గం సమస్యలు పరిష్కారిస్తా

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 24:-

రామగుండం లో నిరుద్యోగుల ఉపాధి కోసం పరిశ్రమలు ఎర్పాటు చెస్తానని కోరుకంటి చందర్ ను గెలిపిస్తే రామగుండం నియోజకవర్గం సమస్యలు పరిష్కారిస్తామని ఎన్నికలు వచ్చినపుడు ఆగమాగం కావద్దు అభ్యర్థి గుణగణాలు, పార్టీ చూసి ఓటు వేయాలనీ కారు గుర్తుకు ఓటు వేసీ బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ ను ఆశీర్వాదించాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రామగుండం నియోజక వర్గం గోదావరిఖని సింగరేణి స్టేడియంలో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సిఎం కేసీఆర్ ప్రసగించారు. ఎన్నికలు వచ్చినపుడు ఆగమాగం కావద్దు అభ్యర్థి గుణగణాలు, పార్టీ చూసి ఓటు వేయాలన్నారు. బీ ఆర్ ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమన్నారు. యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందన్నారు. సింగరేణి నీ నాశనం చేసిందే కాంగ్రెస్ అని చేతకాక సింగరేణి నీ కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా పుట్టించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా కార్మికులను కంటికి రెప్పలగా కపాడుతున్నమని సింగరేణి కార్మికులకు లాభాల వాటా పెంచామని లాభాల వాటా, దీపావళి బోనస్ కలిపి వెయ్యి కోట్లు ఇచ్చన్నారు. కార్మికులకు వేతనాలు ట్యాక్స్ మినహాయింపు చేస్తామన్నారు. సింగరేణీలో 15 వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించామన్నారు. రైతు బందు పుట్టించిందే బీ ఆర్ ఎస్ అన్నారు. 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటుండు3 గంటల కరెంట్ సరిపోతుందా? వారు ప్రశ్నించారు. ధరణి వచ్చాకే రైతుల చేతికి భూమి హక్కులు వర్తంచాయన్నారు.ధరణి బంగాళాఖాతం లో వేయాలని అంటున్నారని వాళ్ళనే బంగాళాఖాతం లో వేద్దామన్నారు. సింగరేణి నీ మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పారు. చందర్ ఉద్యమ సమయంలో 74 రోజులు జైల్లో ఉన్నాడని అన్నారు. రామగుండం లో మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తామని కోరుకంటి చందర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఈ బహిరంగ సభలో ఎమ్మేల్యే బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కోరు కంటి చందర్ ఎంపి వెంకటేష్ నేత ఎమ్మెల్సీ మధుసునచారి రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు జడ్పీటీసీ ఆముల నారాయణ టిబిజికేఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, మిరియాల రాజిరెడ్డి రెడ్డి, మూల విజయ రెడ్డి, కౌశిక హరి కార్పోరేటర్లు బీ ఆర్ ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. 

 

 

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india