V1News Telangana

best news portal development company in india

*రైతులకు నేనున్నాను భరోసానిచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్* *- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి విఠ్ఠల్ రెడ్డి*

SHARE:

*రైతులకు నేనున్నాను భరోసానిచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్*

*- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి విఠ్ఠల్ రెడ్డి*

ముధోల్,నవంబర్ 22(వి1 న్యూస్ తెలుగు): రైతులకు నేనున్నాను భరోసానిచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని
నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు,బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు,

మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్,బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు డాక్టర్ పడకండి రమాదేవితో కలిసి బుధవారం తానూర్ మండలంలో ఉమ్రీ(కే),బోరిగాం,
బెంబర్,బోల్సా,వడ్ ఝరి,
ఝరి(బి),ఝరి(బి) తండా,
బోంద్రేట్,భోసి,మహాలింగి,
బామ్ని,బామ్ని తండా గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు,
ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు,బోరిగాం గ్రామంలో రైతులు భారీ ఏడ్ల బండ్లతో ర్యాలీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు,
ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డి ఏడ్ల బండిపై యేక్కి ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం మని,రైతులకు నేనున్నాను భరోసానిచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు,రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే ప్రభుత్వం బీజేపీ,రైతులకు సరిపడా కరెంటు ఇస్తూ వారికి అండదండగా ఉండే ప్రభుత్వం సారు కారు సర్కారు అన్నారు,
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకుడని తెలంగాణ రాకముందు మన పల్లెల పరిస్థితి ఎలా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత మన పల్లెల పరిస్థితి ఎలా మారిందో మనం కన్నుల ముందర చూస్తున్నామని అన్నారు,
గ్రామాలలో రైతు వేదికలు, డంపింగ్ యాడ్ లు,పల్లె ప్రకృతి వనాలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు మన పల్లెల్లో మనం చూస్తున్నాం అని అన్నారు, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వంమే నని ధిమా వ్యక్తం చేశారు,మరో సారి అవకాశం ఇచ్చి అసేంబ్లి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ముధోల్ ఎమ్మెల్యేగా తనకు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు,ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నారాయణ రావు పటేల్,ఆత్మ చైర్మన్ పోతారెడ్డి,మాజీ ఎంపీపీ రాజన్న,కో ఆప్షన్ మెంబర్ గోవింద్ రావు పటేల్,బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ యాదవ్,
ఎంపీటీసీలు,వివిధ గ్రామాల సర్పంచులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india