V1News Telangana

best news portal development company in india

బోధన్ లో బీజేపీకి, కాంగ్రెస్ కు భారీ షాక్* *బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యనాయకులు*

SHARE:

*బోధన్ లో బీజేపీకి, కాంగ్రెస్ కు భారీ షాక్*

*బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యనాయకులు*

*బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత తిరుపతి హన్మండ్లు, కాంగ్రెస్ నేతలు అభిద్ అలీ,మీర్ వాహెద్ అలీ*

నిజామాబాద్ : బోధన్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవిత గారు మరియు బోధన్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో బీజేపీ జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యుడు, యువ నాయకుడు తిరుపతి హన్మండ్లు (బుజ్జి), కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అభిద్ అలీ, మాజీ కౌన్సిలర్ మీర్ వాహెద్ అలీ మంగళవారం రోజున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కవిత గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ తోనే రాష్ట్ర, జిల్లా అభివృద్ధి సాధ్యమని అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనీ భారీ మెజారిటీతో గెలిపించడానికి తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఆ పార్టీలను విడి బిఆర్ఎస్ లో చేరామని వెల్లడించారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india