V1News Telangana

best news portal development company in india

ఈటల రాజేందర్ సభను విజయవంతం చేయండి.

SHARE:

ఈటల రాజేందర్ సభను విజయవంతం చేయండి...

సామాన్య మహిళకు బిజెపి అవకాశం కల్పించింది..

విలేకరుల సమావేశంలో రామగుండం నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కందుల

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 18:-

గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే.. బిజెపి స్టార్ క్యాంపనర్ ఈటెల రాజేందర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రామగుండం నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్కండేయ కాలనీలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ.. సామాన్య మహిళకు బిజెపి అధిష్టానం అవకాశం కల్పించిందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలందరూ గమనించాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల నుండి రోడ్డు మార్గాన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గోదావరిఖనికి చేరుకుంటారని మొదటగా గోదావరి నది బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికి అనంతరం అక్కడి నుండి బైక్ ర్యాలీగా సభస్థలికి చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుల సంఘాల బాంధవులు ప్రతి ఒక్కరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంధ్యారాణి పిలుపునిచ్చారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india