V1News Telangana

best news portal development company in india

గడప గడపకు బీజేపీ ప్రచారం 

SHARE:

ఇంటింటికి తిరుగుతూ కరపత్రా అందజేస్తున్న బిజెపి కార్యకర్తలు

రుద్రూర్ V1 న్యూస్  : – బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండల కేంద్రంలోని  అంబేమ్ గ్రామంలో    గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. గాడిచిన తొమ్మిది సంవత్సరాల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.. ఈ సందర్బంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు హరి కృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానాలు చెప్పి మరిచిపోయిన విషయాల గురించి ప్రజలకు వివరించినట్టు తెలిపారు. ఈ రాష్ట్రములో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ ల కోసం వేల కోట్లు మంజూరు చేస్తే, ఈ బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చుపెట్టలేదన్నారు. కేంద్రం చేపట్టిన రోడ్లు భవనాలకు కోట్లు ఖర్చుపెట్టిన మరుగు దొడ్లు,సంక్షేమ పతకాలకు నాబార్డ్ బోర్డు కింద దాదాపుగా 3000 వేల కోట్లు ఇస్తే అవి తుతుమంత్రాంగ ఖర్చుపెట్టి మిగుతా నిధులు దారిమళ్ళించారని ఆరోపించారు. కేంద్రం రైతులకు పంట నష్టం నిధులు మంజూరు చేసిన బీఆర్ ఎస్ ప్రభుత్వం రైతులకు ఒక్క రూపాయి కూడ ఇవ్వలేని పరిస్థితి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ కింద ప్రజల ఆరోగ్యం కోసం 12 వేల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో గ్రామ సేవకుల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు నెల నెల జీతాలు ఇవ్వని బీఆర్ ఎస్ ప్రభుత్వఅన్ని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రము బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు కులం, మతం తేడా లేకుండా పార్టీలకు అతీతంగా సుపరి పరిపాలన సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి పార్టీ మండల అధ్యక్షులు హరి కృష్ణ, సుధాకర్ గౌడ్, వడ్ల సాయినాథ్, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india