V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ వార్డ్ మెంబర్

SHARE:

 పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి…

రుద్రూర్ V1 న్యూస్ :   బాన్సువాడ నియోజకవర్గంలో   బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యర్ధి పార్టీల వైపు చూస్తున్న అసంతృప్తుల జాబితా రోజురోజుకి  పెరిగిపోతోంది. ఏకంగా కొందరు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంప్ గ్రామ బిఆర్ఎస్ 4 వార్డ్ మెంబర్ షైక్ జలీల్, అతనితో పాటు సైయాద్ హరుణ్, షైక్ నసీర్ పాషా,షైక్ ఖలీల్, బుధవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా  ఏనుగు రవీందర్ రెడ్డి  మాట్లాడుతూ  బిఆర్ఎస్ అవినీతి, కుటుంబ ఆరాచక పాలనకు విసిగి, బీఆర్ఎస్ నాయకుల నియంత పోకడలకు చరమగీతం పాడడానికి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయని రానున్న రోజుల్లో మరింత మంది కాంగ్రెస్ పార్టీలో వస్తున్నట్టు తెలిపారు  ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india