V1News Telangana

best news portal development company in india

మధ్యం స్టాక్, విక్రయ వివరాలు రిజిస్టర్ లలో పకడ్బందీగా నమోదు చేయాలి- జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

SHARE:

మధ్యం స్టాక్, విక్రయ వివరాలు రిజిస్టర్ లలో పకడ్బందీగా నమోదు చేయాలి- జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం, నవంబర్ -15:-

షాపుకు కేటాయించిన మద్యం స్టాక్, ప్రతి రోజు చేసిన మద్యం విక్రయం వివరాలను పకడ్బందీగా రిజిస్టర్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రామగుండం లోని ఎఫ్. సీ.ఐ. క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న ఎస్.వి.ఎస్. వైన్స్ షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, మద్యం స్టాక్ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని, బెల్ట్ షాపులకు, వివిధ రాజకీయ పక్షాలకు బల్క్ గా మద్యం సరఫరా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదని, అక్రమంగా మద్యం సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మద్యం స్టాకును నిర్దేశించిన గోడౌన్ లలో మినహాయించి, మిగిలిన చోట డంప్ చేయరాదని, నిబంధనలను తప్పకుండా పాటించాలని, లేనియెడల కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ శాఖ సిఐ సుంక రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india