Post Views: 170
పదిహేను మందిని అరెస్ట్

రుద్రూర్ V1 న్యూస్ నవంబర్ 13 : – దీపావళి సందర్బంగా పేకాట ఆడుతున్న స్థావరాలపై రుద్రూర్ పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేసినట్లు రుద్రూర్ ఎస్సై నీరేష్ వెల్లడించారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్ ), చిక్కడపల్లి గ్రామాలల్లో పేకాట ఆడుతున్న స్థావారాలపై రుద్రూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. అంబం గ్రామంలో పేకాట ఆడుతున్న 10 మందిని పట్టుకుని వారి వద్ద నుండి 14,800 రూపాయలు, చిక్కడపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న 5 గురిని పట్టుకుని వారి వద్ద 4,870 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసుకున్నట్లు స్థానిక ఎస్సై నీరేష్ తెలిపారు. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు
Author: Thatipamula Rajashekhar
PRESS








