V1News Telangana

best news portal development company in india

ప్రజా సంక్షేమాన్ని మరిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం

SHARE:

 

 

రుద్రూర్ V1  న్యూస్ నవంబర్ 13 : – గత తొమ్మిదిన్నర ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం  తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మరిచిందని రుద్రూర్ మండల బీజేపీ నాయకులు ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలోని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను బిజెపి పార్టీని ఆదరించమని కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రెండు పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ఎన్నికల హామీలను మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి,దళిత బంధు పథకాలు ఊరుకొకరికి ఇద్దరికీ ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. అలాగే నిరుద్యోగులకు రూ.3 వేల జీవన భృతి అందజేస్తామని చెప్పి విస్మరించిందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపి పార్టీ మండల అధ్యక్షులు హరి కృష్ణ, సుధాకర్ గౌడ్, శంకర్ పటేల్, బిజేపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india