V1News Telangana

best news portal development company in india

రహదారి మీద పడిన ఆయిల్ ప్రమాదాలు జరగకుండా సత్వర చర్యలు తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు.

SHARE:

రహదారి మీద పడిన ఆయిల్ ప్రమాదాలు జరగకుండా సత్వర చర్యలు తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు.

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 12:-

ఎస్ కంపెనీ కి చెందిన భారీ యంత్రం ఇంజన్ లో సమస్య ఏర్పడి అందులోని ఆయిల్ మొత్తం సింగరేణి బంగ్లా ఏరియా వద్ద రహదారి మీద పోవడంతో ఆ దారిలో వచ్చే వాహనాలు అదుపుతప్పి క్రిందపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గమనించి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి సమాచారం అందించగా, సత్వరమే ఇన్స్పెక్టర్ స్పందించి ప్రమాదాలు జరగకుండా ఇద్దరు కానిస్టేబుల్స్ నియమించి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయించారు. ఇసుక లోడ్ తెప్పించి ఆయిల్ పడిన చోట వేయించారు. అయిల్ యొక్క మృదు స్వభావాన్ని పోయేలా చేసి వాహనాలను ప్రమాదాల నుండి కాపాడారు.భారీ యంత్రం ఇంజన్ లో సమస్య ఏర్పడి ఆయిల్ మొత్తం లీక్ అయి రహదారి మీద పడిన క్షణాల్లోనే స్పందించి దీపావళి పండుగ పూట ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్న ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని మరియు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్స్ మురళీ, భూపతి రెడ్డి మరియు మధుకుమార్ లను పోలీస్ ఉన్నతాధికారులతో పాటుగా ప్రజలు అభినందించారు.

 

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india