తానూర్, 9 నవంబర్ (వి1 న్యూస్ తెలుగు): తానూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది,గురువారం మండలంలోని బోల్సా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డిగారి విఠ్ఠల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు,
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు వివరించారు,ఈ సందర్భంగా మాజి ఎంపీపీ రాజన్న,కో ఆప్షన్ మెంబర్ కదం గోవింద్ రావు పటేల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు, వివిధ రకాల పెన్షన్ లు,దళిత బంధు, బిసి బంధు,రైతు కోసం రైతు బంధు,ఇలాంటి అనేక మంచి పథకాలు అమలు
చేస్తుందన్నారు,అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు,అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డిగారి విఠ్ఠల్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు,
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ యాదవ్,ఏఎంసీ డైరెక్టర్ భైంసా మేకల దేవిదాస్,సర్పంచులు విఠాబాయి హన్మండ్లు,జాదవ్ పుండ్లిక్,బాలాజీ,నాయకులు శ్రీనివాస్ రెడ్డి,జాదవ్ రోహిదాస్, మాజీ సర్పంచ్ పండు,జంగు పోతన్న,దేవిదాస్,సుదర్శన్, చుక్కబొట్ల భోజన్న,లక్ష్మన్, మౌల ఖాన్,పాండురంగ్, తదితరులు,పాల్గొన్నారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








