V1News Telangana

*సోషల్ మీడియాలో హద్దులు పోస్టులు పెడితే దాటి కఠిన చర్యలు

*

తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రత్యర్థులను టార్గెట్‌గా చేస్తూ సోషల్​మీడియాలో పోస్టింగులు పెడుతున్నారా? వాటిని చూసి మీరు లైక్​కొట్టి షేర్​చేస్తున్నారా? అయితే జాగ్రత్త. పోలీసులు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు.

హద్దులు దాటి అప్‌లోడ్​ చేస్తున్న పోస్టుల్ని ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు. వాటిని అప్‌లోడ్​చేస్తున్న వారిపైనా, లైక్​కొట్టి షేర్​ చేస్తున్న వారిపైనా కన్నేసి పెట్టారు. అవసరమైతే అప్‌లోడ్ చేస్తున్న వారిపై, లైక్, షేర్ చేస్తున్న వారిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్న విషయం తెలిసిందే. పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శల కోసం సోషల్​మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

అన్ని పార్టీలు సైబర్​వారియర్స్‌తో ప్రతీరోజూ వందల సంఖ్యలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటూ పోస్టింగులను వాట్సాప్​గ్రూపులు, ట్విట్టర్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్​ఇలా అన్ని సోషల్​మీడియా వేదికల్లో అప్‌లోడ్​ చేస్తున్నారు.

అయితే ఈ పోస్టుల్లో కొన్ని శృతి మించి ఉంటున్నాయి. దీనిపై ఓ సీఐడీ సీనియర్​ అధికారి మాట్లాడుతూ విమర్శ అన్నది హద్దుల్లో ఉంటే సమస్య ఉండదని, ప్రత్యర్థి ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెడితేనే సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పారు.

ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులపై కన్నేసి పెట్టినట్టు చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బంది పని చేస్తున్నారన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

హద్దులు దాటే పోస్టులను చూసి లైక్​కొట్టినా, షేర్​ చేసినా అలాంటి వారిపై కూడా అవసరమైతే చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా వివాదాస్పద పోస్టులకు లైకులు కొడుతూ గ్రూపుల్లో షేర్​చేస్తున్న వారిపై కూడా నిఘా పెట్టామన్నారు.

ఐటీ యాక్ట్​సెక్షన్​67 ప్రకారం ఎవరినైనా టార్గెట్​చేస్తూ వల్గర్​ కంటెంట్‌ను సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేస్తే అయిదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే సెక్షన్​66ఈ ప్రకారం అవతలివారి ప్రైవసీని దెబ్బతీసేలా పోస్టులు పెడితే మూడేళ్ల కారాగార శిక్ష, రూ.3లక్షల జరిమానా పడే అవకాశం ఉంటుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?