V1News Telangana

best news portal development company in india

హ్యాట్రిక్ విజ‌యం సాధిస్తా..* *ప్ర‌జ‌ల ఆశీర్వాదం నాకే ఉంది..* *నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతా..విఠ్ఠల్ రెడ్డి..*

SHARE:

*ప్రజలే నా బలం.. బలగం…!*

*హ్యాట్రిక్ విజ‌యం సాధిస్తా..*

*ప్ర‌జ‌ల ఆశీర్వాదం నాకే ఉంది..*

*నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతా..విఠ్ఠల్ రెడ్డి..*

ముధోల్,నవంబర్ 09(వి1 న్యూస్ తెలుగు): ముధోల్ నియోజకవర్గం ప్రజలే నా బలం బలగం,ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో మూడ‌వ‌సారి విజ‌యం సాధిస్తాన‌ని ముధోల్ నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ అభ్య‌ర్థి,ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డి అన్నారు,సీఎం కేసీఆర్ స‌హ‌కారంతో ముధోల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుంచానని,
మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీరంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా మ‌రింత అభివృద్ధి చేస్తాన‌ని తెలిపారు,గురువారం ముధోల్ ఎన్నికల రిటర్నింగ్ కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా విఠ్ఠల్ రెడ్డి నామినేషన్ ప‌త్రాలు అంద‌జేశారు,అంత‌కుముందు బాసర శ్రీ సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి,త‌న నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు,నామినేష‌న్ వేసిన
అనంత‌రం ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డి మాట్లాడారు నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా సేవ చేయ‌డానికి ప్రజలే కారణం,
ఈసారి కూడా తనను ఎప్పటిలాగే ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతాని తెలిపారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు,
బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ త‌ర‌హాలో ఒక్క ప‌థ‌కాన్నైనా అమ‌లు చేస్తున్నారా అని ప్ర‌శ్నించారు,
మూడవసారి ప్రజలు ఆశీర్వాదం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని తెలిపారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india