సోమరపు భారీ బైక్ ర్యాలీ దద్దరిల్లిన ఖని అట్టహాసంగా సోమరపు నామినేషన్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 08:-
స్వతంత్ర అభ్యర్థి గా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయ బుధవారం అట్టహాసంగా నామినేషను వేశారు, తన యొక్క అనుచరులు, అభిమానులు మరియు ప్రజలు భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు,స్వతంత్ర అభ్యర్థిగాపోటీ చేస్తున్న సోమవారం సత్యనారాయణ ప్రత్యర్థులకు దీటుగా ప్రచారంలోముందుకు సాగుతూ నే ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. భారీగా తరలి వచ్చిన తన అభిమానులతో కలిసి ప్రధాన కూడలిలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ రామగుండం ప్రజలు తనకి ఎప్పుడూ మద్దతుగా నిలిచారని గతంలో ఏ విధంగా అయితే నన్ను స్వతంత్ర అభ్యర్థి గా నన్ను గెలిపించారొ, ఈసారి కూడా తప్పకుండా తిరిగి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపిస్తారనె నమ్మకం నాకు ఉంది అని.అవి నీతి పరులకు, గూండాలకు, కబ్జాదారులకు,రామగుండం ప్రజలు భయపడరని ,అవినీతి రహిత పాలన, అభివృద్ధి కోసం పాటుపడే నాయకునికి ప్రజలు మరొకసారి ప్రజలు పట్టం కడతారని,ప్రజలకి నా పైన పూర్తి విశ్వాసం ఉందని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని,గెలిచాక యువకులకు, మహిళలకు, స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వారు జీవితంలో ఎదగడానికి సహకరిస్తానని తెలిపారు.తాను అధికారంలోకి వక్చాక మిగిలిపోయిన అన్ని పనులు పూర్తి చేసి రామగుండం నియోజకవర్గాన్ని తెలంగాణలోనే ఆదర్శ నియోజవర్గం గా తీర్చి దిద్దుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ లావణ్య మాజీ మేయర్ రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ,కోదాటి ప్రవీణ్,వడ్లూరి రవి,రవి నాయక్,మామిడాల చంద్రయ్య,కిషన్ రావు,వీరన్న,పత్తి సంజీవ్, సుభాష్, నారాయణ రెడ్డి,బిక్షపతి,చంద్రశేఖర్ గౌడ్,సంపంగి శ్రీనివాసు,కమల్ గౌడ,రాజుడేవిడ్,రాయ మల్లు,రమణారెడ్డి,సురేష్ అడ్వకేట్ సురేష్,రాయాలింగు,పాశం రాజు,వీరేశం,సునిల్,సురెందరు,అరవిందు,కిషోర్,సురేష్,రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్, రవి,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








