బ్యాంకు లావాదేవీల నిఘాపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

V1 న్యూస్ తెలంగాణ పెద్దపల్లి, నవంబర్ -08:
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగానికి బ్యాంకర్ లు సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్, జిల్లాఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ బ్యాంక్ అధికారులతో బ్యాంకు ఖాతా లావాదేవిలపై నిఘా అంశంపై సమావేశం నిర్వహించారు.కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికలు సక్రమంగా నిర్వహణకు మూడు నియోజక వర్గాల పరిధిలో స్టాటిక్ సర్వేలెన్సు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసి అక్రమ నగదు, మధ్యం పంపిణీ జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. బ్యాంకు ఖాతాలో నుండి సైతం డబ్బు బదిలీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని, దీనిని నివారించేందుకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగానికి బ్యాంకర్లు సహకరించాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై సైతం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని, బ్యాంకు ఖాతా నుంచి తరచుగా లావాదేవీలు జరిగితే వాటిని పరిశీలించాలని, ఒకేసారి పెద్ద మొత్తంలో విత్ డ్రా జరిగిన వెంటనే సమాచారం అందించాలని అన్నారు. బ్యాంకు లావాదేవీలలో అధిక సంఖ్యలో ఖాతాలకు ఒక ఖాతా నుంచి డబ్బు వెళ్లడం, ఒక ఖాతా నుంచి తరచుగా డబ్బు విత్ డ్రా చేయడం వంటి వాటిని నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రోజూ జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకు శాఖ నుంచి జరిగే అనుమానాస్పద లావాదేవీలు, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల సమాచారం సాయంత్రం 6 గంటల వరకు రిపోర్ట్ అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల ఖర్చుల నోడల్ అధికారి శ్రీమాల, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, నాబార్డ్ ఏజిఎం ఎన్. జయ ప్రకాష్, బ్యాంకర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








