V1News Telangana

best news portal development company in india

అభివృద్ధికి నోచుకుని కూరగాయల మార్కెట్ మార్కెట్ భవన సముదాయం పేరుతో నిధుల దుర్వినియోగం

SHARE:

అభివృద్ధికి నోచుకుని కూరగాయల మార్కెట్ మార్కెట్ భవన సముదాయం పేరుతో నిధుల దుర్వినియోగం

బిజెపిని గెలిపిస్తే మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా…

రామగుండం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 08:-

గత పాలకుల నిర్లక్ష్యంతోనే కూరగాయల మార్కెట్ అభివృద్ధికి నోచుకోలేదని రామగుండం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం గోదావరిఖని సీతానగర్ కూరగాయల మార్కెట్ లో రైతులను, వ్యాపారులను కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ… కూరగాయల మార్కెట్ భవన సముదాయం పేరుతో గత పాలకులు కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు వర్షా కాలంలో కూరగాయలను నిల్వ చేసుకోవడానికి కనీస వసతులను కల్పించడంలో విఫలమయ్యారన్నారు. రామగుండం నియోజకవర్గం లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున తనను గెలిపిస్తే… గెలిచిన నెల రోజుల్లో మార్కెట్ ను సుందరీకరణగా తీర్చిదిద్ది దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తానన్నారు. మార్కెట్ లో కూరగాయలను నిల్వ చేసుకోవడానికి సరైన వసతులు లేకపోవడంతో వ్యాపారులు, రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యంతోనే మార్కెట్ అసాంఘిక కార్యకలాపాలకు నీలయంగా మారుతుందని విమర్శించారు. పరిశ్రమలకు నిలయమైన పారిశ్రామిక ప్రాంతంలోని మార్కెట్ లో కనీసం తాగడానికి మంచినీరు సైతం అందుబాటులో లేవన్నారు. సామాన్య మహిళగా బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వ్యాపారులను కోరారు. అలాగే నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ప్రజల కోసమే పని చేశానని గ్రామాల అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. ఇంతకు ముందు గెలిచిన నాయకులు ఏమి అభివృద్ధి చేశారో ఒకసారి ఆలోచించాలని , బిజెపి తరఫున పోటీ చేస్తున్న తనను గెలిపించి మహిళ నాయకత్వం తీసుకురావాలని పిలుపునిచ్చారు. నేను గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇచ్చిన హామీలను అమలు చేస్తానన్నారు. బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. అనంతరం మార్కెట్ వ్యాపారులు సంధ్యారాణిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు . ఈ కార్యక్రమంలో కొండపర్తి సంజీవ్, హనుమంతు గౌడ్, రాజు నరేందర్ రంజిత్ కుమార్ శ్రీనివాస్ ఆకాష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india