నవంబర్ 11న ఛలో హైదరాబాద్ ఎమ్మార్పీఎస్ మహసభను విజయవంతం చేయండి
– ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గడ్డం తుకారాం
నిర్మల్, నవంబర్ 05(వి1 న్యూస్ తెలుగు): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్వర్యంలో ఈ నెల 11న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వ రూప మహాసభకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ముఖ్య అతిథిగా హాజరౌతుతున్నారని,ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శులు గడ్డం తుకారాం,నందకుమార్, మాదిగలు తెలిపారు,జనసమీకరణ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల కేంద్రమైన తానూర్ తో పాటు ఝరి(బి),
కోలూర్,బోరిగాం, హిప్నెల్లి,తదితర గ్రామాలలో పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు, ఆనంతరం తానూర్ ప్రెస్ క్లబ్ లో విలెకరుల తో మాట్లాడుతూ.. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఎస్సీ వర్గీకరణ సభకు వస్తుండటం పై హర్షం వ్యక్తం చేశారు,మాదిగ,మాదిగ ఉపకులాల వారు ఈ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ సందర్భంగా సభ పోస్టర్లను విడుదల చేశారు,ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గడ్డం తుకారామ్,జాతీయ క్వాలిటీ బ్యూరో నందకుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి బాబు,రాష్ట్ర కార్యదర్శి అంబేకర్ సాయిచంద్,బైంసా డివిజన్ అధ్యక్షులు సురేష్,
మండల అధ్యక్షులు సాహెబ్రావు,భైంసా మండల అధ్యక్షులు ఆజేశ్ బాలేరావ్,తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








