V1News Telangana

best news portal development company in india

సోమారపు గూటికి 19 వ డివిజన్ సీనియర్ నాయకులు కొమ్ము గట్టయ్య

SHARE:

బి అర్ ఎస్ కి భారీ షాక్ సోమారపు గూటికి 19 వ డివిజన్ సీనియర్ నాయకులు కొమ్ము గట్టయ్య 100 మంది తో చేరిక

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 04:-

స్వతంత్ర అభ్యర్థి గా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ ఈ రోజు 19 వ డివిజన్ పోతన కాలనీ ,న్యూ మారేడుపాక లో ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నపుడు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 వరకు ప్రజల కు అందుబాటులో ఉండి సేవ చేసానని, ప్రతి డివిజన్ లో కమ్యూనిటిహాల్స్ ,మహిళా భవనాల కు నిధులు సమకూర్చానని, కాని ఇంత వరకు అవి పూర్తి చేయలేదని,నేను తీసుక వచ్చిన వందల కోట్ల రూపాయల పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదని చెప్పారు. తిరిగి నన్ను గెలిపించుకుంటే మీకు 24 గంటలు మంచి నీరు అందించి,ఈ ప్రాంతాన్ని గ్రీన్సిటీ గా మర్చి కాలుష్య రహిత ప్రాంతగా అభివృధి చేసి చూపిస్తానని,వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు తీసుక వచ్చే సత్తా తనకు ఉందని ఆ నిధులతో రామగుండం ని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని తెలియ చేశారు, ఇవి నాకు చివరి ఎలెక్షన్స్ అని మీరు ఓటు వేసి మళ్లీ నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత రూపు ,రేఖలు మారుస్తా,కొంత మంది వందల కోట్లు ఖర్చుపెట్టి మిమ్మల్ని మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారు అటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి, ఈ ప్రాంతం మళ్ళీ అభివృద్ధి చెందాలంటేనాకు ఓటు వేసి నన్ను గెలిపించాలనికోరారు.ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ లావణ్య మాజీ మేయర్ రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్ రవి నాయక్,కడారి సురేష్,లక్ష్మీనారాయణ,మేకల రమణరెడ్డి,అనిల్,సురేష్,వెంకటేష్,కుమార్,శ్రవణ్,లక్ష్మీనారాయణ,రాజేష్ నాయక్, బిక్షపతి,చంద్రశేఖర్ గౌడ్,సురేష్,వీరేశంసునిల్,సురెందరు,అరవిందు,,కిషోర్,సురేష్,రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india