ఆలకుంట మల్లేష్ ఆధ్వర్యంలో బీజేపీలోకి వలసలు
బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కందుల సంధ్యారాణి.
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 3:-
అంతర్గాం మండల్ ఎల్లంపల్లి, గ్రామ, అంతర్గాం టి టి ఎస్ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నుండి ఆలకుంట మల్లేష్ ఆధ్వర్యంలో బిజెపిలో కి 40 మంది యువకులు చేరారు.రామగుండం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి ఆలకుంట మల్లేష్ ను బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ రామగుండం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని రామగుండం నియోజకవర్గంలో విస్తృతంగా గెలిపి దిశగా ప్రయాణిస్తుందని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. యువత చూపు బిజెపి వైపు ఉందని రోజు రోజుకు బిజెపిలో యువకులు పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్య పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా రామగుండంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి గెలుపు ఖాయమన్నారు. బిజెపి ఎన్నికల గుర్తు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో. ఆలకుంట మల్లేష్, రమేష్ ,రాజేందర్, సతీష్ ,రాజ్ కుమార్, సారయ్య, ఏ. రమేష్ ,జి .శేఖర్, కుమార్, బి .శ్రీకాంత్, ఎస్. నరేష్, ఎస్ కుమార్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








