V1News Telangana

best news portal development company in india

రామగుండంను స్మార్ట్ సిటీగా మారుస్తా లేదంటే 6 నెలల్లో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

SHARE:

రామగుండంను స్మార్ట్ సిటీగా మారుస్తా లేదంటే 6 నెలల్లో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

రామగుండం తొలి మహిళ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించండి

రామగుండం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 02:-

రామగుండం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపిస్తే 6 నెలల్లో గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానని, లేనియెడల తన పదవికి రాజీనామా చేస్తానని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ… 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో అవినీతి లేకుండా పనిచేశానని తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. శాంతియుత వార్తావరణంలో ఉన్న ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టించే విధంగా నాయకులు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పారిశ్రామిక ప్రాంతంలో గాలి, నీరు కూడా కలుషితమైపోయిందన్నారు. రామగుండం ప్రాంత ప్రజలు చైతన్యవంతులని ఇప్పుడు ధర్మం.న్యాయం. మంచి వైపు నిలుస్తారని పేర్కొన్నారు. 30 ఏళ్ల రాజకీయ ప్రజాక్షేత్రంలో బిజెపి అధిష్టానం తొలిసారిగా మహిళా నాయకురాలిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిందని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి కేంద్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. ఈ సందర్భంగా అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. మహిళా చట్టాలను అమలు చేయడంలో ఇతర పార్టీలు విఫలమయ్యారని కానీ భారతీయ జనతా పార్టీ బిజెపి పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పించి చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటుందన్నారు. రామగుండం స్మార్ట్ సిటీగా మారితే ఎంతోమందికి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు వస్తాయని తెలిపారు. బిజెపి అధిష్టానం ఒక్క నీరు పేద మహిళకు అవకాశం కల్పించిందని ప్రజలు ఆదరించి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని అన్నారు.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india