V1News Telangana

best news portal development company in india

నామినేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్

SHARE:

నామినేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం, నవంబర్ -01:

ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ఫారం, అఫిడవిట్ లో ప్రతి కాలం తప్పనిసరిగా నింపి సమర్పించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు.మంగళవారం రామగుండంలోని ఎన్టీపీసీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జే. అరుణశ్రీ తో కలిసి పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నామినేషన్ల ప్రక్రియపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, నవంబర్ 3 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, అభ్యర్థులు సరైన డాక్యుమెంట్లతో సకాలంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలని అన్నారు.అభ్యర్థులు నామినేషన్ కి వచ్చే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు చేయడానికి వీలు లేదని కలెక్టర్ తెలిపారు.నామినేషన్ ప్రక్రియ సమయంలో అభ్యర్థులకు సహాయం చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని, నామినేషన్ పత్రాలు పరిశీలించి, సమర్పించాల్సిన పెండింగ్ డాక్యుమెంట్లు ఏదైనా ఉంటే వివరాలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఎన్టీపీసీలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని విద్యార్థుల విద్యా ప్రమాణాలు పరిశీలించారు. ఉన్నతి కార్యక్రమాన్ని పాఠశాలలో కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు, పాల్గొన్నారు..

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india