V1News Telangana

best news portal development company in india

గోదావరిఖని ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా కృషి చేయాలి

SHARE:

గోదావరిఖని ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా కృషి చేయాలి

బిజెపి రామగుండం నియోజకవర్గ అభ్యర్థి కందుల సంధ్యారాణి

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 01:-

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వాకర్స్ ని కలిశారు. బిజెపికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ… గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం ఇప్పటికే సింపతితో ఓ నాయకుడిని నమ్మి మోసపోయిందన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని రాయలసీమగా మార్చేందుకు కొందరు నాయకులు వస్తున్నారని విమర్శించారు. వీధికో రౌడీ ఇంటికొ రౌడీని తయారు చేయడానికి కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గోదావరిఖని ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతంలో గాలి నీరు కలుషితమైపోయిందన్నారు. ఏలాంటి నాయకులు ఓట్ల కోసం మన దగ్గరికి వస్తున్నారు ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. బిజెపికి ఓటు వేసి తనను గెలిపించాలని మార్నింగ్ వాకర్స్ ని కోరారు. మంచి కోసం గోదావరిఖని ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలు ఆలోచించాలని ఒక్కసారి బిజెపికి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. రామగుండం నియోజకవర్గం నుండి బిజెపి తరఫున ఒక మహిళ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని వాకర్స్ ని సంధ్యారాణి కోరారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india