V1News Telangana

best news portal development company in india

అభివృద్ధి చేయని ఎమ్మెల్యేని సాగనంపాలె – బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్

SHARE:

అభివృద్ధి చేయని ఎమ్మెల్యేని సాగనంపాలె

– బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్

ముధోల్,అక్టోబర్ 31(వి1 న్యూస్ తెలుగు): తొమ్మిదేళ్ల కాలంలో అభివృద్ధి చేయని ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని ముధోల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్ అన్నారు,మంగళవారం భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు,ప్రజల్లోకి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేఖత ఉందన్నారు,చెప్పుడు మాటలే తప్పా.. ఆయన చేసేందేమి లేదని,గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు ఎదురు తిరుగబడుతున్నారన్నారు,ప్రధాని మోఢీ హాయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని,డబుల్ ఇంజిన్ సర్కారు కావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు, బీజేపీలో చేరినప్పుడు తాను సామాన్య కార్యకర్తలా పని చేస్తానని ప్రమాణం చేశానని, అధిష్ఠానం అవకాశం ఇవ్వడంతో బరిలో ఉండడం జరిగిందన్నారు,
నాయకులు,వస్తు పోతుంటారని,కార్యకర్తలకు బీజేపీ ముఖ్యమన్నారు,ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు సువర్ణ అవకాశమన్నారు,
బూత్ ల వారిగా ఇంచార్జీలు పని చేసి అత్యధిక మెజార్టీతో గెలిచేలా చూడాలన్నారు,కేసీఆర్ మోసకారి మాటలకు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు,ఇచ్చిన హామీలు విస్మరించి బీఆర్ఎస్ సర్కారు నవ్వుల పాలైందన్నారు,పాత,కొత్త తేడా లేకుండా కార్యకర్తలకు సమన్యాయం
చేస్తానన్నారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి,జిల్లా ఇంచార్జీ మల్లారెడ్డి,పార్లమెంట్ ప్రభారి అల్జాపూర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి పాండే,గంగాధర్,నారాయణ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్,భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు,పట్టణ అధ్యక్షులు మల్లేశ్,జడ్పీటీసీలు దీపా బీంరావు,వసంత రమేష్, కుంటాల మాజీ ఎంపీపీ రమణరావు,కౌన్సిలర్లు, బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు,పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india