V1News Telangana

best news portal development company in india

గిరిజన నిధులతో బంధువులకు రోడ్లు నిధులను పక్కదారి పట్టించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి – తప్పని నిరూపిస్తే మార్కట్ చైర్మన్ పదవీకి రాజీనామా చేస్తా – వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ రాజేష్ బాబు

SHARE:

గిరిజన నిధులతో బంధువులకు నిర్మల్,అక్టోబర్ 31(వి1 న్యూస్ తెలుగు): ప్రభుత్వం గిరిజన తండాలకు రోడ్ల మంజూరు కోసం నిధులిస్తే ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆ నిధులను పక్కాదారి పట్టించి గిరిజనులకు మోసం చేశారని బీజేపీ నేత,ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు అన్నారు, మంగళవారం భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జీన్నింగ్ ఫ్యాక్టరీలో మీడియాతో మాట్లాడారు,తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే మార్కెట్ కమిటి చైర్మన్ పదవీకి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఏం చేస్తారు అని సవాల్ విసిరారు,రూ,3.4కోట్ల నిధులతో గిరిజన తండాలకు కేటాయించిన నిధులు వాలేగాం గ్రామం ఎస్టీ కాలనీ నుండి రంగారి గుడిసెలకు రోడ్డు వేశారన్నారు,అసలు ఎస్టీలకు సంబంధం లేకుండా తన బంధువల పంట పోలాల కోసం రహదారి వేయడం జరిగిందన్నారు,అదే విధంగా రూ,4.12కోట్లతో తరోడా నుంచి చింతకుంట తండా అంటూ ముథోల్ బీఆర్ఎస్ లీడర్ సూర్యం కోసం ఈ నిధులను రోడ్డు నిర్మాణం చేశారన్నారు, దీంతోనే ఎమ్మెల్యే బంధు ప్రీతికి ఎంత విలువ ఇస్తున్నారో తెలుస్తుందన్నారు, 2020లో బుర్గుపల్లి నుంచి గమ్మాపూర్ తండాకు మంత్రి సత్యవతి రాథోడ్కు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విన్నవించారని,అయితే ఆ నిధులను అక్కడ వాడకుండా దారి మళ్లించారన్నారు, పక్షపాతి వైఖరి అవలంభించిన ఎమ్మెల్యేను సాగనంపి తీరుతామని స్పష్టం చేశారు, తండాల నిధులు తన ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం సరికాదన్నారు,తక్షణమే గిరిజనులకు సమాధానం చెప్పాలని,లేని పక్షంలో గిరిజనులంతా ఎమ్మెల్యేను ఓడిస్తారని చెప్పారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india