V1News Telangana

best news portal development company in india

బిజెపి పార్టీలో చేరినా మాజీ మహిళా సర్పంచ్

SHARE:

రుద్రూర్ : రుద్రూర్ మండలంలోని రాయకూరు గ్రామ మాజీ మహిళా సర్పంచ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మి నారాయణ సమక్షంలో మంగళవారం బీజేపీ పార్టీలో చేరారు.  ఆమెకు  బిజేపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ  రాష్ట్రములో అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కెసిఆర్ మాటలు అన్ని ఉత్తిత్తివే ఏద్దేవా చేశారు. రానున్న రోజుల్లో మహిళలకు బీజేపీ పార్టీ అన్నివిధాలా అభివృద్ధి పతంలో నడిపిస్తారని ఆమె తెలిపారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షులు హరికృష్ణ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మరియు మండల ప్రధాన కార్యదర్శులు సాయినాథ్ గజేందర్ తదితరులు పాల్గొన్నారు

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india