Post Views: 153
బోధన్ v1న్యూస్ అక్టోబర్ 28: సాలూర మండలం హున్సా, జాడి జమాల్ పూర్ గ్రామాలలో బి ఆర్ ఎస్ నాయకులు శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ బోధన్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు జక్క సంజు పటేల్, ఎంపీటీసీ శివకుమార్ లు మాట్లడుతూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ నియోజకవర్గంలోఎంతో అభివృద్ది చేశారని ప్రజలు మళ్ళీఆశీర్వదించి షకీల్ అమీర్ ను గెలిపిస్తే మరింత అభివృధ్ది చేస్తారని తెలిపారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కార్ గుర్తుకు ఓటేసి షకీల్ అమీర్ ను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఅర్ విడుదల చేసిన మేనిఫెస్టో లోని హామీలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జక్క నాగరాజ్ పటేల్,మరకలే నాయుడు, తిరుపతి,ఎంజి గంగారాం,ఆనంద్ రావ్, నందిశేట్టి ప్రకాశ్,కన్న విఠల్, హన్మంతరావు, రజాక్,ఇర్ఫాన్ కుషాల్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
Author: Thatipamula Rajashekhar
PRESS








