
–బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి షకిల్ అమీర్…
ఫోటో : సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే షకీల్…
రెంజల్ : తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ అమీర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని సాటాపూర్ గ్రామ శివారులో గల సమియా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదిన్నరేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తెస్తాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు. అదేవిదంగా బిజెపి కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, ప్రస్తుతం ఆ పార్టీలను నమ్మే స్థితిలో లేరని అన్నారు.
పలువురు యువకులు బీఆర్ఎస్ లో చేరిక…
మండల కేంద్రంతో పాటు తాడ్ బిలోలి,బోర్గం,కళ్యాపూర్ బాగేపల్లి,కందకుర్తి గ్రామాల యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.నీలా సొసైటీ మాజీ చైర్మెన్ ఫెరోజ్ బేగ్ తో పాటు నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరడంతో వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ ఎకార్ పాషా, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నంద కుమార్,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేష్ కుమార్,పార్టీ మండల అధ్యక్షుడు భూం రెడ్డి,సర్పంచులు పాముల సాయిలు,జాదవ్ గణేష్,ఖలీం బేగ్,సొసైటీ చైర్మన్లు ఇమాంబేగ్, మొయినుద్దీన్,ఎంపీటీసీలు అహ్మద్,అసద్ బేగ్,పార్టీ మండల ఉపాధ్యక్షుడు హజీఖాన్,ఉపసర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి ఫేరోజోద్దీన్,నాయకులు తెలంగాణ శంకర్,రఫిక్,నర్సయ్య,బాబు నాయక్,విజయ్,రాఘవేందర్, సాయిరెడ్డి,శేఖర్, చందూర్.సంతోష్,సాయా గౌడ్,కూర్మ సాయిలు,పిట్ల.భూమేష్,జాడి సాయిలు,అంకం.సంతోష్, రాజు,అనిల్,షబ్బీర్ తదితరులు ఉన్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








