V1News Telangana

best news portal development company in india

భక్తి శ్రద్ధలతో దుర్గామాత నిమజ్జన ఉత్సవం – వైభవంగా శోభాయాత్ర….

SHARE:

నిర్మల్,అక్టోబర్ 25(వి1 న్యూస్ తెలుగు): తానూర్ మండలంలోని బోల్సా గ్రామంలో బుధవారం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి,అమ్మవారికి 9 రోజుల పాటు విశేష పూజలు అందించిన భక్తులు చివరి రోజున అమ్మవారికి ఉత్తర పూజలు చేసి, భాజాభాజంత్రీలు మంగళహారతులతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించి శోభాయాత్ర నిర్వహించారు,

డీజే పాటల పై యువకులు చేసిన సాంస్కృతిక నృత్యాలు,ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి,యువతులు,మహిళలు బతుకమ్మ పాటలకు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి,
అనంతరం గోదావరినదిలో అమ్మవారిని నిమజ్జనం చేశారు,నిర్వాహకులు
భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,గ్రామంలో ఎక్కడా చూసినా దేవి నవరాత్రి ఉత్సవాల శోభా ఆగు పడింది,
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఉత్సవం కమిటీ సభ్యులు,యువకులు,భక్తులు,గ్రామస్తులు,మహిళలు, తదితరులు,పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india