రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, స్పీడ్, కంఫర్ట్‌తో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత పెంచేందుకు ఇండియన్ రైల్వేస్ మరో అడుగు ముందుకు వేసింది. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్‌ని పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. 2024 ఫిబ్రవరి- మార్చిలో వందే భారత్ స్లీపర్ ట్రైన్లు అందుబాటులోకి రావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ట్రైన్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా భారతదేశ మౌలిక సదుపాయాల నైపుణ్యానికి నిదర్శనంగా కూడా నిలవనుంది.
* చెన్నైలో తయారీ
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ పార్ట్‌నర్‌షిప్‌తో బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్ లిమిటెడ్ నేతృత్వంలో వందే భారత్ స్లీపర్ వెర్షన్లను తయారు చేస్తున్నారు. ఐకానిక్ రాజధాని రైళ్ల స్థానంలో రానున్న వందే భారత్ స్లీపర్ కోచ్ ఇనాగరల్ ప్రోటోటైప్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ చైర్ కార్ వెర్షన్స్, ఇప్పటికే ఉన్న రైళ్లకు భిన్నంగా కొత్త ట్రైన్లలో విభిన్నమైన ఫీచర్లు ఉంటాయి. అవేంటంటే..
నవరాత్రులు.. కాళీకా దేవీ చిటికెన వేలు పడిన ప్రదేశమిదే..
* స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రక్చర్
వందే భారత్ స్లీపర్ కోచ్ మొత్తం స్ట్రక్చర్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించారు. ఇది డ్యూరబిలిటీతో పాటు స్లీక్ ఎక్స్‌టీరియన్‌ని అందిస్తుంది. స్ట్రైకింగ్ వైట్ బాడీతో వైబ్రెంట్ ఆరెంజ్ స్ట్రైప్స్‌తో అదిరిపోయే లుక్‌తో ఆకర్షించనుంది. ట్రైన్ లోపల తేలికపాటి లేత గోధుమరంగులో డెకరేషన్స్, సాధారణ ప్రాంతాలతో పాటు ప్రతి సీటు వద్ద మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్‌తో ప్రయాణికులు సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు.
* కంఫర్ట్ సీటింగ్
మరింత సౌకర్యవంతమైన ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఉద్దేశించిన వందే భారత్ స్లీపర్ రైలు 16 కోచ్‌లతో వస్తుంది. వాటిలో ఒక ఫస్ట్ టైర్ AC కోచ్, 2-టైర్ కోచ్‌లు నాలుగు, 3-టైర్ AC కోచ్‌లు పదకొండు ఉంటాయి. సీట్లు, బెర్త్‌లు అనుకూలమైన ఎత్తులో, ఖరీదైన కుషనింగ్‌తో బెస్ట్ కంఫర్ట్ అందించేలా రూపొందాయి. ప్రయాణికులు మళ్లీ మళ్లీ వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో ట్రావెల్ చేయాలనుకునే లక్ష్యంతో ఫీచర్లను పొందుపరుస్తున్నారు.
* యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు
వందే భారత్ స్లీపర్ రైలులో అప్పర్ బెర్త్‌లకు ఎక్కే ట్రెడిషినల్ హార్డ్ స్టీల్ స్టెప్స్ స్థానంలో సాఫ్టెర్ మెటీరియల్‌ను వినియోగించారు. ఈ అప్‌గ్రేడ్ ప్రయాణికుల కంఫర్ట్, యాక్సెసిబిలిటీని పెంచుతుంది.
* ఇన్నోవేటివ్ డిజైన్, లేఅవుట్
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఫస్ట్ ప్రోటోటైప్ మొత్తం 22 కోచ్‌లను కలిగి ఉంది, ఇందులో 857 బెర్త్‌లు ఉన్నాయి. ఈ బెర్త్‌లలో దాదాపు 5% ఇండియన్ రైల్వేస్ సిబ్బందికి కేటాయిస్తారు. మిగిలిన 823 ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. రైలు డిజైన్‌లో మూడు టాయిలెట్‌లు, మినీ ప్యాంట్రీ, ప్రతి సీటు వద్ద రీడింగ్ ల్యాంప్‌లు, డ్రెస్సింగ్ మిర్రర్, మొబైల్ స్టాండ్, లోయర్ బెర్త్‌లో సీట్ల మధ్య హ్యాండ్‌రెస్ట్-కమ్-కాఫీ టేబుల్‌తో పాటు సెంట్రల్ టేబుల్ సహా అనేక సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.
థాట్‌ఫుల్ లైటింగ్ డిజైన్ ఆకట్టుకుంటుంది. లైటింగ్ కాన్సెప్ట్ యూనిఫార్మ్‌గా, ఆహ్లాదకరంగా ఉంటుంది. రాత్రిపూట ప్రయాణాల్లో కూడా ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తుంది. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ బెటర్ టెంపరేచర్ కంట్రోల్‌తో అందుబాటులోకి వస్తోంది. ఎక్స్‌టర్నల్ టెంపరచేర్‌కు అనుగుణంగా కోచ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మెయింటైన్ చేసే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది.
* ప్రయాణికులకు అనుకూలం
వందే భారత్ స్లీపర్ ట్రైన్ డిజైన్ భారతదేశ రవాణా అవసరాల ప్రత్యేక లక్షణాలకు అనుగుణంగా ఉంటుంది. భారత్‌లోని రైళ్లు ఇతర దేశాల కంటే ఒక్క ట్రైన్‌లోనే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకువెళ్లడంలో ప్రసిద్ధి చెందాయి. వీరికి ఆన్‌బోర్డ్ ఎక్స్‌పీరియన్స్ ఆప్టిమైజ్ చేస్తూ, స్పేస్ అలకేషన్, యుటిలైజేషన్ పెంచుతూ వందే భారత్‌ని రూపొందించారు.
* సేఫ్టీ ప్రధానం
స్లీపర్ వందే భారత్‌లో సెమీ-పర్మనెంట్ కప్లర్ ఎన్‌హ్యాన్స్‌డ్ వెర్షన్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇది సెన్సిటివ్ బ్రేకింగ్, కుదుపు లేని ప్రయాణాన్ని ప్రామిస్ చేస్తుంది. ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. రైలు మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి, వందే భారత్ చైర్ కార్లలో కనిపించే విధంగా ‘కవచ్’ అనే ఆటోమేటిక్ రైలు రక్షణ (ATP) సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..
]
Source link

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....