Central Government Employees: విజయ దశమి పండగ వేళ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, రైల్వే ఎంప్లాయిస్‌తో పాటు రైతులకు తీపి కబురు చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు డీఏపను 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినేట్ తీర్మానం చేసింది. అటు రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లింపులతో గోధుమ సహా ఇతర ఆరు పంటలకు ఎంఎస్పీ ధర పెంచుతూ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆర్ధిక వ్యవహరాలు కేబినేట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. గోధుమలకు కనీస మద్దతు ధర రూ. 150 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆ విషయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలియజేసారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న డియర్‌నెస్ అలవెన్స్‌ను 42 శాతం నుంచి 46 శాతానికి పెంచింది. జూలై 1 నుంచి పెరగిన డీఏ వర్తించనుంది. 7వ పే స్కేల్ కమిషన్ సిపార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపుతో 48.67 లక్షల మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది. మరోవైపు 67.95 లక్షల మంది పెన్షనర్లకు కూడా లాభపడనున్నారు.
రైల్వే ఉద్యోగులకు బోనస్..
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల సమానమైన బోనస్ చెల్లించనున్నారు. 2022-23 ఆర్ధిక యేడాదికిగాను ఆర్‌పీఎఫ్ మినహా ట్రాక్ మెయింటెనర్లు.. లోకే పైలెట్లు.. ట్రెయిన్ మేనేజర్లు.. స్టేషన్ మాస్టర్లు.. సూపర్ వైజర్లు.. టెక్నీషియన్లు ఇలా అర్హులైన 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం రూ. 1966.87 కోట్లు చెల్లించనున్నట్టు చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీస్
గోధుమలకు మద్ధతు ధర
గోధుమలు అధికంగా పండించే రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గోధుమలకు క్వింటాలకు రూ. 150 మద్దతు ధర భారీగా పెంచింది. 2024-25 యేడాది మార్కెటింగ్ సీజన్‌కు గాను క్వింటాల్‌కు రూ. 150 చొప్పున పెంచి రూ. 2275గా నిర్ణయించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇంత భారీగా గోధుమలకు మద్ధతు దర పెంచడం ఇదే తొలిసారి. భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ సూచనల మేరకు రబీ సీజన్‌కు సంబంధించి గోధుమ సహా ఆరు పంటకు మద్ధతు 2.215గా ఉంది. అలాగే బార్లీపై 115పెంచి రూ. 1850.. శనగపై రూ. 105 పెంచి.. రూ. 5440.. కందులపై రూ. 425 పెంచి న.. 6425.. ఆవాలపై రూ. 200 పెంపుతో రూ. 5650.. పొద్దుతిరుగుడు పువ్వు సన్ ఫ్లవర్ పై రూ. 150 పెంచి రూ. 5,800గా కనీస మద్ధతు ధర నిర్ణయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..
]
Source link

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....