V1News Telangana

best news portal development company in india

NaMo Bharat Train: ర్యాపిడ్ ఎక్స్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. వీడియో చూడండి

SHARE:

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నమో భారత్ రైలు (NaMo Bharat Train)ను ప్రారంభించారు. ఈ రైలును ర్యాపిడ్ ఎక్స్ రైలు (RapidX train), రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (RRTS) రైలు అని కూడా పిలుస్తున్నారు. ముందుగా… ఢిల్లీ NCR పరిధిలో.. షాహిదాబాద్ నుంచి దుహాయ్ డిపో మధ్య నడిచిన రైలును ప్రారంభించిన మోదీ.. అందులో ప్రయాణించారు. రైలు సిబ్బంది, స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు.
ప్రధాని మోదీ.. ఇవాళ ఢిల్లీ-ఘజియాబాద్- మీరట్ మధ్య నిర్మిస్తున్న RRTS కారిడార్లో కొంత రైలు మార్గాన్ని ఉత్తరప్రదేశ్‌లోని షాహిదాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి నమో భారత్ రైలు. RRTS రైళ్లు.. హైస్పీడ్ రైళ్లు. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. ముందుగా ఇవి ఢిల్లీ.. నేషనల్ క్యాపిటర్ రీజన్ (NCR)లో సిటీలు, పట్టణాలను కలుపుతాయి.

దేశంలో మొదటి కారిడార్ అయిన ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్ రూట్ నిర్మాణంలో ఉంది. ఇందులో ఘజియాబాద్ – మీరట్ కారిడార్ అందుబాటులోకి వచ్చింది. అందువల్ల షాహిదాబాద్ నుంచి దుహాయ్ డిపో వరకూ ఉండే కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. ఈ కారిడార్‌లో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఈ కారిడార్ పూర్తిగా అమల్లోకి వచ్చాక, వాతావరణ కాలుష్యం బాగా తగ్గిపోతుంది.
ప్రస్తుతానికి ప్రయాణికులు సహిబాబాద్ నుంచి దుహాయ్ డిపో స్టేషన్ వరకూ 17 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణించవచ్చు. ఇందుకు సాధారణ కోచ్‌లో టికెట్ ధరను రూ.50గా నిర్ణయించారు. అదే ప్రీమియం క్లాస్ కోజ్ అయితే రూ.100గా నిర్ణయించారు.

యూట్యూబ్ వాడేవాళ్లు ఈ కొత్త ఫీచర్ల గురించి తప్పక తెలుసుకోండి

యూట్యూబ్ వాడేవాళ్లు ఈ కొత్త ఫీచర్ల గురించి తప్పక తెలుసుకోండి

RRTSని ర్యాపిడ్ ఎక్స్‌గా కూడా పిలుస్తున్నారు. దీన్ని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. దీని ద్వారా ప్రయాణికులకు మరింత వేగవంతమైన రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టీ.. రైళ్ల సంఖ్యను పెంచనున్నారు. ప్రతీ రైలులో 1200 మంది ప్రయాణించవచ్చు. ప్రతీ ర్యాపిడ్ ఎక్స్ రైలులో.. ఆరు కోచ్‌లు ఉంటాయి. వాటిలో ఒకటి ప్రీమియం కోచ్‌లా ఉంటుంది. ఒక కోచ్‌ని మహిళలకు కేటాయించారు. ఇది ప్రీమియం కోచ్‌ పక్కన ఉంటుంది. ఇక కోచ్‌లలో కూడా మహిళలు, ముసలివారు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..


]

Source link

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india