V1News Telangana

best news portal development company in india

Covid 19 And Dengue: డెంగీ తీవ్రతను పెంచుతున్న కోవిడ్-19 యాంటీబాడీస్? లేటెస్ట్ స్టడీ డీటైల్స్‌ ఇవే!

SHARE:

 

కరోనా వైరస్ వ్యాప్తి దాదాపు ఆగిపోయినా సరే దాని ప్రభావాలు ప్రజలపై ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. తాజాగా కోవిడ్ 19, డెంగీ రోగులను కూడా ప్రభావితం చేస్తుందని భారతీయ శాస్త్రవేత్తల కొత్త అధ్యయనంలో తేలింది.
డెంగీ వైరస్‌కు రోగనిరోధక వ్యవస్థ భిన్నంగా స్పందించేలా చేయడం ద్వారా కోవిడ్-19, డెంగీ కేసులను మరింత తీవ్రతరం చేస్తుందని భారతీయ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (THSTI)లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కండక్ట్ చేసిన ఈ అధ్యయనాన్ని ఇంకా ఇతర నిపుణులు రివ్యూ చేయలేదు. THSTI అనేది ప్రభుత్వం నిర్వహించే ఒక పరిశోధనా కేంద్రం.

రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయోద్దని హైకోర్టులో పిటిషన్..

రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయోద్దని హైకోర్టులో పిటిషన్..

బయోఆర్‌క్సివ్ (bioRxiv) వెబ్‌సైట్‌లో ఈ స్టడీని ప్రచురించారు. సైంటిఫిక్ పేపర్స్‌ను జర్నల్స్‌లో ప్రచురించే ముందు బయోఆర్‌క్సివ్‌లో ప్రచురిస్తుంటారు. లేటెస్ట్ స్టడీలో కోవిడ్ -19తో పోరాడటానికి శరీరం ఉత్పత్తి చేసే కోవిడ్ యాంటీబాడీస్ (Covid antibodies) డెంగీ వైరస్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయో సైంటిస్టులు విశ్లేషించారు.
ఆ విశ్లేషణలో కోవిడ్ యాంటీబాడీస్ DENV-2 అని పిలిచే ఒక రకమైన డెంగీ వైరస్‌ను గుర్తించి, బంధించగలవని కనుగొన్నారు. అయితే DENV-2 వైరస్‌ను తటస్థీకరించే బదులు, కోవిడ్ యాంటీబాడీస్ అనేవి మరిన్ని కణాలకు సోకేలా చేస్తాయి. దీనిని యాంటీబాడీ-డిపెండెంట్ ఎన్‌హాన్స్‌మెంట్ (ADE) అంటారు.
* డెంగీ కేసుల పెరుగుదలతో రీసెర్చ్‌
ఈ అధ్యయనం కోవిడ్ యాంటీబాడీస్ డెంగీ వైరస్ టైప్‌తో క్రాస్-రియాక్ట్ చేయగలవని, ఇన్‌ఫెక్షన్‌ను తీవ్రతరం చేయగలవని చూపించిన మొదటిది. వివిధ రకాల కరోనా వేవ్స్ సమయంలో కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి కమర్షియల్ ప్రొడక్ట్స్, యానిమల్ సెరా, హ్యూమన్ ప్లాస్మా శాంపిల్స్ వంటి వివిధ కోవిడ్ యాంటీబాడీలను శాస్త్రవేత్తలు ఉపయోగించారు.
భారతదేశంలో డెంగీ కేసులు ఇటీవల పెరగడం, డెంగీ తీవ్రతపై కోవిడ్-19 ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ అధ్యయనం చేశారు. డెంగీ వైరస్ భారతదేశంలో కాలక్రమేణా పరిణామం చెందిందని, దాని జన్యు అలంకరణ, ప్రవర్తనను మారుస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
డెంగీ వైరస్‌లో నాలుగు రకాలు (DENV 1, 2, 3, 4) ఉన్నాయి. 2012కి ముందు, DENV 1, 3 భారతదేశంలో ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు DENV 2 ప్రబలంగా మారింది. DENV 4 కూడా కొన్ని ప్రాంతాలలో ఉద్భవించింది. వీటిని పరిశీలించడమే అధ్యయనం లక్ష్యంగా పెట్టుకుంది.
దోమల ద్వారా వ్యాపించే డెంగీ వ్యాధి ఏటా భారతదేశంలో లక్షల మందిని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి రోగులలో జ్వరం, దద్దుర్లు, కీళ్ల నొప్పులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు, ఇది డెంగీ హెమరేజిక్ ఫీవర్, డెంగీ షాక్ సిండ్రోమ్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. అధికారిక సమాచారం ప్రకారం, 1996 నుంచి డెంగీ కేసులు 13 రెట్లు పెరిగాయి, 2022లో 303 మంది డెంగీతో మరణించారు.
* అధ్యయనం కొనసాగిందిలా
కోవిడ్-19 యాంటీబాడీలు డెంగీ వైరస్‌కు అంటుకుని, దానిని బలపరుస్తాయని చూపించడానికి శాస్త్రవేత్తలు కంప్యూటర్ మోడల్స్, ల్యాబ్ ఎక్స్‌పరిమెంట్స్ ఉపయోగించారు. ప్రజలు, జంతువుల నుంచి వివిధ రకాల కోవిడ్-19 యాంటీబాడీస్ తీసుకుని డెంగీ వైరస్ బారిన పడే రెండు రకాల కణాలపై అవి ఎలా ప్రభావం చూపుతాయో పరీక్షించారు. కోవిడ్-19 యాంటీబాడీస్, డెంగీ వైరస్‌లు బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయని, డెంగీ సంక్రమణను పెంచుతాయని కనుగొన్నారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

]

Source link

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india