V1News Telangana

best news portal development company in india

యూపీలోని పూర్వాంచల్ లో భారీ రావణ దహనం.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..!

SHARE:

చెడుపై మంచికి ప్రతీకగా నిలిచే గొప్ప పండుగ దసరా. ఈ విజయదశమి పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంటారు. అనేక చోట్ల రావణ దహనం కార్యక్రమం చేస్తుంటారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ఈ ఏడాది దసరా రోజున పూర్వాంచల్ రావణ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు.
వారణాసిలోని బీఎల్ డబ్ల్యూలోని రామ్ లీలా మైదానంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 75 అడుగుల ఎత్తున్న రావణాసురుడిని దహనం చేయనున్నారు. దీనితో పాటు 70, 65 అడుగుల ఎత్తున్న మేఘనాధ్, కుంభకర్ణుడి విగ్రహాన్ని కూడా సిద్ధం చేశారు.

ఇదీ చదవండి: ఒక్క ఏడాదిలోనే 11వేల మంది పిల్లలకు తండ్రి కాబోతున్న రాజా.. ఇది మామూలు విషయం కాదు..!

ఈ రావణ దహనం సమయంలో సుమారు 1 గంట పాటు అద్భుతమైన బాణసంచా కాల్చనున్నారు. ఇందు కోసం రావణాసురుడికి సుమారు 50 వేల రూపాయల విలువ చేసే బాణసంచాను అమర్చినట్లు చెబుతున్నారు. ఈ రావణ దహనం చూసేందుకు బరేకా మైదానం లోపల, వెలుపల లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
మైదానం లోపల కూడా ప్రజలు వీక్షించేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో వీఐపీల కోసం కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రావణ దహనానికి 2 గంటల ముందు మోనో నటన ద్వారా బరేకాలోని రామ్ లీలా మైదానంలో రామ్ లీలా ప్రదర్శన ఇవ్వనున్నారు.

బ్లూ ఆధార్ గురించి మీకు తెలుసా..?


బ్లూ ఆధార్ గురించి మీకు తెలుసా..?

ఈ రావణుడిని తయారు చేయడానికి సుమారు రెండు నెలలు పట్టిందని నిర్వాకులు తెలిపారు. ఎంతో కష్టపడి దీనిని తయారు చేశామని కళాకారుడు షంషాద్ పేర్కొన్నారు. 2వందల మంది కళాకారులు రెండు నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. షంషాద్ కుటుంబం మూడు తరాలుగా ఈ పని చేస్తోంది.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

]

Source link

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india