V1News Telangana

best news portal development company in india

స్మశాన కాళి ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..? గోకర్ణ క్షేత్రంలో కొలువైన ఈ కాళీ మాత ప్రత్యేకత ఏంటంటే..?

SHARE:

ఉత్తర కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో కొలువైన స్మశాన కాళి దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ దేవాలయం త్రేతా యుగం కాలం నాటిదని అంటుంటారు. భద్రకాళి, రుద్రకాళి మరియు స్మశాన కాళి ముగ్గురు చాలా శక్తివంతమైన దేవతలు. ముఖ్యంగా స్మశాన కాళీ తంత్ర దేవత. శివుడి కంటే శక్తిమంతమైన ఈ జగత్తుమాత తన ఎడమ కాలును శివునిపై ఉంచి, కుడిచేతిలో ఖడ్గాన్ని పట్టుకుని ఆర్భాటాన్ని అర్పిస్తూ తిరిగే రక్షకురాలు.
మహాబల సన్నిధి నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న స్మశాన వాటిక పక్కనే ఈ ఆలయం ఉంది. ఈ దేవాలయం లోపల రుద్రకాళి, స్మశానకాళి, వినాయక, నాగ విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నిలబడి దేవత ను ఏదైనా కోరిక కోరితే తప్పకుండా తీరుతుందని స్థానికులు చెపుతుంటారు.

ఇదీ చదవండి: యూపీలోని పూర్వాంచల్ లో భారీ రావణ దహనం.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..!

స్థల పురాణం ప్రకారం.. ప్రపంచంలోని అన్ని దేవతలు మరియు దేవతల కంటే స్మశాన కాళి ఉనికి చాలా రహస్యమైనదని.. అదే సమయంలో భయంకరమైనదని అంటుంటారు. స్మశాన కాళి అమ్మవారు గాడిదలు మరియు తోడేళ్ళపై స్వారీ చేస్తుండేదని.. నాలిక బయట పెట్టి.. జుట్టు విరబూసుకొని, గుండ్రని ఎర్ర కళ్లతో నాట్యం చేస్తునట్లు ఉంటుందని చెపుతున్నారు. అలాగే రాక్షసుల పుర్రెలను మాలగా దరిచారని అంటున్నారు. ఇక అమ్మవారికి 10 చేతులు ఉంటాయని చెపుతున్నారు.

బొప్పాయిని ఎక్కువగా తింటే కలిగే నష్టాలివే..


బొప్పాయిని ఎక్కువగా తింటే కలిగే నష్టాలివే..

ఈ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పూజా పునస్కారాలు నిర్వహిస్తారు. ఒక వైపు చితి మండుతుంటే మరోవైపు ఆలయంలో పూజలు చేసే పద్ధతి.. మన దేశంలో కేవలం రెండే రెండు ఆలయాల్లో ఉంది. అందులో మొదటిది కాశీ కాగా.. రెండోది గోకర్ణ క్షేత్రంలో కొలువైన స్వశాన కాళి ఆలయంలోనే. మహాబలేశ్వర్ సన్నిధానం నుండి కేవలం అర కిలోమీటరు దూరం నడవడం ద్వారా ఈ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నిశ్శబ్ద ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. ఒక అద్భుతమైన అనుభూతి కోసం ఈ స్థలాన్ని సందర్శించండి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

]

Source link

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india