V1News Telangana

best news portal development company in india

గరుడ దేవుడి ఏకైక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.. ఇక్కడ పూజలు చేస్తే కాలసర్ప దోషం నుంచి విముక్తి లభిస్తుందంట..!

SHARE:

ఉత్తరాఖండ్ లోని రిషీకేశ్ లో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి దేవాలయానికి ఎంతో చరిత్ర.. ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఈ దేవాలయాలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది తరలి వచ్చి.. దర్శించుకొని వెళుతుంటారు. ఇక రిషికేష్ కు పది కిలోమీటర్ల దూరంలో, నీలకంఠ మహాదేవ్ ఆలయానికి 18 కిలోమీటర్ల దూరంలో పౌరీ జిల్లాలో పురాతన గరుడ ఆలయం ఉంది. ఈ ప్రదేశాన్ని గరుడ చత్తి అని కూడా పిలుస్తారు.

ఇదీ చదవండి: స్మశాన కాళి ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..? గోకర్ణ క్షేత్రంలో కొలువైన ఈ కాళీ మాత ప్రత్యేకత ఏంటంటే..?

ఈ గరుడ దేవుని ఆలయానికి రావడం ద్వారా.. ఆ వ్యక్తి జాతకంలో ఉన్న కాలసర్ప దోషం తొలగిపోతుందని స్థానికుల నమ్ముతారు. ఉత్తరాఖండ్ లోని గరుడదేవునికి ఉన్న ఏకైక ఆలయం ఇది కావడం విశేషం. ఇక ఈ ఆలయానికి ఉత్తరాఖండ్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆలయ సమీపంలో పచ్చదనం, ఆహాదకరమైన వాతావరణం ఉండటంతో.. ఎక్కువ మంది ఈ ప్రదేశానికి రావడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఈ ఆలయ సమీపంలోని నిర్మించిన చెరువు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ చెరువులో రంగురంగుల చేపలు ఆలయ అందాన్ని మరింత పెంచుతాయి.

నువ్వులు ఇలా వాడితే గుండెపోటు, చర్మవ్యాధులు ఫసక్.. పైల్స్ పరార్..!


నువ్వులు ఇలా వాడితే గుండెపోటు, చర్మవ్యాధులు ఫసక్.. పైల్స్ పరార్..!

ఈ చెరువు సాధారణ చెరువు కాదని స్థానికులు చెపుతుంటారు. ఈ చెరువు గరుణ్ గంగతో నేరుగా సంబంధం కలిగి ఉందని నమ్ముతుంటారు. ఈ చెరువు నీరు మామూలు నీరు కాదని.. దీనికి అనేక రోగాలను తొలగించే శక్తి ఉందని భక్తుల విశ్వాసం. దీనితో పాటు ఇక్కడి కోనేరులోని రకరకాల చేపలు ఉన్నాయి. వాటికి పిండి మాత్రలు పేడా తినిపించడం వల్ల.. రాహువు లోపం తొలిగిపోతుందని భక్తులు భావిస్తుంటారు. దీంతో నిత్యం వందలాది మంది ఈ ఆలయానికి వచ్చి.. కోనేరులో స్నానం చేస్తూ.. చేపలకు ఆహారం వేస్తారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

]

Source link

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india