V1News Telangana

best news portal development company in india

లవర్స్ అడ్డాగా మారిన నిజామాబాద్ తిలక్ గార్డెన్.. పట్టణపు ప్రసిద్ధ గార్డెన్‌లో మారుతున్న వాతావరణం

SHARE:

నిజామాబాద్ పట్టణంలోని తిలక్ గార్డెన్‌పై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబాలతో కలిసి విశ్రాంతి కోసం వచ్చే ఈ ప్రదేశం ప్రస్తుతం ప్రేమికుల అడ్డాగా మారిందని వారు చెబుతున్నారు.

ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ ప్రేయసి-ప్రియులతో కలిసి చెట్ల పొదల్లో కూర్చొని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, దీంతో పార్క్‌కు వచ్చే కుటుంబాలు అసౌకర్యానికి గురవుతున్నాయని సందర్శకులు అంటున్నారు. గతంలో కుటుంబాలతో సందడి చేసిన ఈ గార్డెన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రేమ జంటలే కనిపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలో ప్రసిద్ధి గాంచిన తిలక్ గార్డెన్ ప్రస్తుతం తన అసలు గుర్తింపును కోల్పోయి కేవలం లవర్స్ అడ్డాగా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పార్క్‌లో పర్యవేక్షణ పెంచి, కుటుంబాలకు అనుకూల వాతావరణం కల్పించాలని వారు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india