నగరేశ్వర–వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీ శ్రీధర్ ఆచారి చేత పంచాంగ శ్రవణం
ఉగాది పచ్చడి రుచులతో భక్తుల ఆనందం
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులకు సత్కారం..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా స్థానిక శ్రీ నగరేశ్వర–శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ వేడుకలలో ముఖ్యంగా సిద్ధాంతి శ్రీ శ్రీధర్ ఆచారి గారు నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశముందని, యమునా నది పుష్కరాలు జరుగనున్నాయని తెలిపారు. అలాగే ఈ సంవత్సరంలో చంద్ర, సూర్య గ్రహణాలు లేవని వివరించారు.
పంచాంగ శ్రవణ అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి రుచులు చూపించి, అర్చక స్వాములచే తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సిద్ధాంతి శ్రీ శ్రీధర్ ఆచారి గారిని, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ మహారాజ్ గారిని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కొత్త రాజేశ్వర్ గుప్తా, గంజి వెంకటేశం గుప్తా, ప్రదీప్ గుప్తా, కంటాల రమేష్, పబ్బ మురళి, వాసర గంగాధర్, పార్శి శ్రీధర్ గుప్తా, మాశేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







