Post Views: 9
ఎన్‌హెచ్–44 రహదారిపై భద్రతా చర్యలు బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు
నిజామాబాద్, మార్చి 16:
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు ఇటీవల జరిగిన ఖురానా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. మార్చి 13వ తేదీ తెల్లవారుజామున ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామ శివారులో జాతీయ రహదారి–44పై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే.
ఈ ఘటనపై సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీస్ కమిషనర్ ప్రమాదం జరిగిన తీరు, కారణాలు, భద్రతా లోపాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ రహదారి–44పై భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం ఇందల్వాయి మండలంలో అమరవీరుల కుటుంబాలకు కేటాయించిన ఇంటి స్థలాలను కూడా కమిషనర్ సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
తదుపరి సిర్నాపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలను సందర్శించిన ఆయన పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ధైర్యం చెప్పి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుతూ సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండి ప్రతి ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకుని సమాధానాలు రాయాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిచ్‌పల్లి సీఐ కె. వినోద్, ఇందల్వాయి ఎస్సై జి. సందీప్ తదితర సిబ్బంది పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








