బోధన్ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో రాత్రి సమయంలో ధాబాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటల తరువాత కూడా ధాబాలు మూసివేయకుండా కొనసాగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాత్రి వేళల్లో ఇసుక రవాణా చేసే వారికి ధాబాల్లో మందు విందులు ఏర్పాటు చేసి, వారికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట లైట్లు ఆఫ్ చేసి లోపల సిట్టింగ్లు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
కొంతమంది కింది స్థాయి అధికారులకు మామూలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇసుక మాఫియాకు సహకరిస్తున్న ధాబాలపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







