✍️ మంచి నీటి పైప్లైన్ లీకేజీలు.
✍️ రోడ్లకు ఇరువైపులా చెత్తాచెదారం.
✍️ పట్టించుకోని పంచాయతీ అధికారులు.
✍️ అవస్థలు పడుతున్న కాలనీ వాసులు.

బోధన్ : సాలూర మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ సమస్యలకు నిలయంగా మారింది.కాలనీ సమస్యలపై అధికార పాలక యంత్రాంగం పట్టింపు లేకుండా పోయిందని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నీటి సరఫరా పైప్ లైన్ లీకేజీలు తీవ్రమయ్యాయి.లీకేజీలతో నీరు కలుషితమై కాలనీ వాసులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుకున్నాయి.రోడ్ల పక్కనే చెత్తాచెదారం పేరుకు పోయింది.దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల స్వైర విహారం రోజు రోజుకు తీవ్రమవుతుంది.విష జ్వరాలు అధికమై ప్రజలు ఆసుపత్రిల చుట్టు చెక్కర్లు కొడుతున్నారు.గ్రామపంచాయతీ అధికార పాలకవర్గం తక్షణమే చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.లేనియెడల మండల,డివిజన్,జిల్లా సంబంధిత అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయవలసి వస్తుందని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








